Omicron In Delhi : ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు
దేశ రాజధానిలో మంగళవారం మరో నాలుగు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు వెలుగుచూశాయి. తో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. వీరందరూ విదేశాల
- venkaiahnaidu
- Published On : December 14, 2021 / 03:15 PM IST
Delhi
Omicron In Delhi : దేశ రాజధానిలో మంగళవారం మరో నాలుగు కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” కేసులు వెలుగుచూశాయి. తో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. వీరందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఆరుగురిలో ఒకరు కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారని సత్యేంద్ర జైన్ తెలిపారు.
ప్రస్తుతం మిగిలిన వారిని లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ కు తరలించామని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఢిల్లీ ఆరోగ్యమంత్రి తెలిపారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పరిస్థితులు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇక, ఇప్పటివరకు 74మందిని ఎయిర్‌పోర్టు నుంచి హాస్పిటల్ కు తరలించామని, అక్కడి స్పెషన్ వార్డుల్లో ఒమిక్రాన్ అనుమానితులకు చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఢిల్లీలో తాజాగా నమోదైన ఒమిక్రాన్ కేసులతో.. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ బారినపడిన వారి సంఖ్య 45కు చేరింది.
ALSO READ Sadhvi Saraswati : హిందువులంతా కత్తులు చేతబట్టాలి..సాధ్వి వివాదాస్పద వ్యాఖ్యలు
