Delhi Techie Crime: దేశ రాజధానిలో ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను హత్య.. పక్కా ప్లాన్, చివరికి బిగ్ ట్విస్ట్
వెబ్ సిరీస్‌లు, షోలు సమాజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయో నిరూపిస్తూ ఓ 62 ఏళ్ల సాఫ్ట్‌వేర్(Delhi Techie Crime) కన్సల్టెంట్ తన భార్యను అత్యంత పూరితంగా హత్య చేశాడు.
- V Santhosh Kumar
- Published on- August 7, 2026 / 05:21 PM IST
Delhi man killed wife inspired by a web series arrested
- వెబ్ సిరీస్ చూసి హత్య
- భార్యను చంపిన వృద్ధ భర్త
- మథురలో నిందితుడి అరెస్ట్
Delhi Techie Crime: దేశ రాజధాని ఢిల్లీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తలపించేలా ఒక భయంకరమైన ఘోరం వెలుగుచూసింది. డిజిటల్ యుగంలో క్రైమ్ వెబ్ సిరీస్‌లు, షోలు సమాజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయో నిరూపిస్తూ ఓ 62 ఏళ్ల సాఫ్ట్‌వేర్(Delhi Techie Crime) కన్సల్టెంట్ తన భార్యను అత్యంత పూరితంగా హత్య చేశాడు. తూర్పు ఢిల్లీ ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ‘ది స్టెయిర్‌కేస్’ అనే ప్రముఖ క్రైమ్ వెబ్ సిరీస్ స్ఫూర్తితో పక్కా ప్లాన్ ప్రకారం ఈ హత్యకు ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
Fortune Oil: ఫార్చ్యూన్ ఆయిల్ వాడేవారికి షాక్.. నో క్వాలిటీ, నో విటమిన్స్.. తేల్చేసిన ల్యాబ్
ఆస్తి గొడవలు, విక్రయించిన నగదుతో పరారీ:
పోలీసుల కథనం ప్రకారం.. కమల్ సింగ్ (62), కోమల్ సింగ్ దంపతుల మధ్య గత కొంతకాలంగా ఆస్తి తగాదాలతో పాటు కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. జూలై 30న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కమల్ కత్తి, కత్తెరతో భార్యపై దాడి చేసి దారుణంగా అంతమొందించాడు. అనంతరం తన రక్తం బట్టలను మార్చుకుని, ఇంట్లోని రూ.5 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల నుండి మరో రూ.7 లక్షలు విత్‌డ్రా చేసి మొత్తం రూ.12.75 లక్షలతో పరారయ్యాడు. రాత్రి ఇంటికి వచ్చిన కుమారుడు రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి పోలీసులకు సమాచారం అందించాడు.
దర్యాప్తును తప్పుదోవ పట్టించి మథురలో అరెస్ట్:
నేరం చేసిన తర్వాత కమల్ హత్యకు ఉపయోగించిన కత్తిని దారిలోనే పడేసి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తూ నేపాల్ పారిపోయేందుకు యత్నించాడు. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేందుకు గోరఖ్ పూర్, మథుర ప్రాంతాలకు తిరిగాడు. అయితే ఎలక్ట్రానిక్ నిఘా సహాయంతో ఢిల్లీ పోలీసులు మూడు రోజుల పాటు గాలించి మథుర రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న సొత్తును, స్కూటర్‌ను రికవరీ చేసి, వెబ్ సిరీస్ ద్వారానే ఆధారాలు మాయం చేయడం నేర్చుకున్నట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
