Narendra Modi
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ నగరంలో మీరట్ మెట్రో, నమో భారత్ రైలు సేవలను ప్రారంభించారు. ఈ మెట్రో రైలు దేశంలోనే అత్యంత వేగంగా నడిచే మెట్రో.
దీని గరిష్ఠ వేగం సుమారు గంటకు 120 కిలోమీటర్లు. ప్రస్తుతం భారతదేశంలోని ఇతర మెట్రో వ్యవస్థల సాధారణ గరిష్ఠ వేగం సుమారు గంటకు 80-90 కిలోమీటర్ల మధ్య ఉంటుంది.
మోదీ ఇవాళ శతాబ్దీ నగర్ నమో భారత్ స్టేషన్‌ను సందర్శించారు. రూ.12,390 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ఆయన ప్రారంభించిన మెట్రో సేవలు ఇవాళ సాయంత్రం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
అలాగే, నమో భారత్ రైలు ఢిల్లీ నుంచి మీరట్ మధ్య గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 180 కిలోమీటర్లు.
Also Read: ఏఐ సమ్మిట్‌లో షర్టులు విప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు రచ్చ.. మోదీ ఘాటు కామెంట్స్..
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాంతీయ రవాణా వ్యవస్థల విస్తరణ కార్యక్రమంలో భాగంగా వీటిని మోదీ ప్రారంభించారు. ప్రయాణ సమయం, రద్దీ తగ్గించడం, పర్యావరణానికి అనుకూల రవాణాను ప్రోత్సహించడం లక్ష్యం.
ఢిల్లీ-మీరట్ నమో భారత్ కారిడార్ మొత్తం 82 కిలోమీటర్ల పొడవున నిర్మాణం పూర్తి అయింది. ఇది అధిక వేగం, అధిక ఫ్రీక్వెన్సీ కనెక్టివిటీతో ఢిల్లీ, మీరట్ మధ్య ప్రయాణాన్ని సులభం చేస్తుంది.
पीएम श्री @narendramodi ने शताब्दी नगर नमो भारत स्टेशन पर मेरठ मेट्रो और नमो भारत ट्रेन को हरी झंडी दिखाई और यहां से मेरठ साउथ स्टेशन तक मेट्रो का सफर किया। pic.twitter.com/MNHHpKvk42
— BJP (@BJP4India) February 22, 2026