హై అలర్ట్.. దేవాలయాలే టార్గెట్.. దాడులకు ఉగ్రవాదుల ప్లాన్
ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను పెంచినట్లు పోలీసులు వివరించారు.
- T Venkateshwarlu
- Published On : February 21, 2026 / 02:59 PM IST
Red Fort
- ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు
- దాడులకు ఎల్‌ఈటీ ప్రణాళికలు
- ఎర్రకోట వద్ద ఓ గుడి మెయిన్ టార్గెట్?
Delhi on high alert: ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని ప్రార్థనా మందిరాలపై దాడులకు లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ) ప్రణాళికలు వేసుకుంది. ముఖ్యంగా ఎర్రకోటకు సమీపంలోని ఓ గుడిపై దాడులు చేయాలని ఎల్‌ఈటీ భావిస్తోంది.
ఇస్లామాబాద్‌లో ఇటీవల జరిగిన బాంబు దాడికి ప్రతిగా ఢిల్లీలో దాడులు చేయాలని ఎల్‌ఈటీ ప్రణాళికలు వేసుకుంది.
ఉగ్రవాదులు ఐఈడీ దాడులు చేసే ముప్పు ఉందని, చాందిని చౌక్ ప్రాంతంలోని ఓ మందిరాన్ని లక్ష్యంగా ఉందని నిఘావర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది.
Also Read: AI Chat : ఫుడ్ లవర్స్‌కు పండగే.. ఇక AI చాట్‌తో ఫుడ్ ఆర్డర్.. UPIతో పేమెంట్స్.. అన్నీ ఒకే చాట్‌లోనే!
తాజాగా వచ్చిన ఉగ్రదాడుల అలర్ట్ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించి, ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను పెంచినట్లు వివరించారు. దాడులు జరగకుండా ఉండేందుకు ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
కాగా, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని షియా మసీదు వద్ద ఫిబ్రవరి 6న సూసైడ్ బాంబుదాడి జరిగి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గణతంత్ర దినోత్సవానికి ముందుగా కూడా ఉగ్రదాడులు జరగవచ్చన్న అలర్ట్ వచ్చిందని సంబంధిత అధికారులు అన్నారు.
