Delhi Youth: వ్యాక్సినేషన్ కోసం 100కిలోమీటర్లు వెళ్తోన్న ఢిల్లీ యూత్

ఢిల్లీలో వ్యాక్సినేషన్ లో భాగంగా 18 నుంచి 44ఏళ్ల ఏజ్ గ్రూప్ వారికి వ్యాక్సిన్ వేయడంలో గ్యాప్ ఇచ్చారు. వ్యాక్సిన్ కొరత ఏర్పడటంతో దాని కోసం 100కిలోమీటర్లు ప్రయాణించి వ్యాక్సిన్ డోస్ వేయించుకుంటున్నారని ...

Delhi Youth Travelling 100km To Get Jabbed

Delhi Youth: ఢిల్లీలో వ్యాక్సినేషన్ లో భాగంగా 18 నుంచి 44ఏళ్ల ఏజ్ గ్రూప్ వారికి వ్యాక్సిన్ వేయడంలో గ్యాప్ ఇచ్చారు. వ్యాక్సిన్ కొరత ఏర్పడటంతో దాని కోసం 100కిలోమీటర్లు ప్రయాణించి వ్యాక్సిన్ డోస్ వేయించుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అతీషీ అంటున్నారు.

వ్యాక్సిన్ అపాయింట్మెంట్ బుకింగ్ లు ఢిల్లీలో ఓపెన్ చేసినప్పటికీ పరిమిత సంఖ్యలోనే వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారణంతోనే వ్యాక్సినేషన్ కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని మెసేజ్ వస్తేనే తాము బుక్ చేసుకున్నామని యువత కంప్లైంట్ చేస్తున్నారు.

అంతకంటే ముందు కేంద్రం జూన్ 10కల్లా వ్యాక్సిన్ సప్లై చేస్తామని హామీ ఇచ్చింది. కానీ, జూన్ 2నుంచి కొరత ఇంకా పెరిగిపోతూనే ఉంది.

’18నుంచి 44ఏళ్ల ఏజ్ గ్రూపులో ఉన్న చాలా మంది సెకండ్ డోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపు 100 నుంచి 200కిలోమీటర్లు ప్రయాణించి మీరట్, బులంద్ షార్ వరకూ వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఎందుకంటే ఢిల్లీలో వ్యాక్సిన్ లేవు. వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నా వ్యాక్సిన్ కొరత కనిపిస్తూనే ఉంది’ అని అతీషి అన్నారు.

ఢిల్లీ గవర్నమెంట్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ కోసం సెకండ్ డోసేజ్ వారు మాత్రమే రావాలని కన్ఫామ్ చేసింది. వ్యాక్సిన్ కొరత ఉండటంతో ఫస్ట్ డోస్ కు కొవాగ్జిన్ వేసుకోవడానికి ఎటువంటి అనుమతి లేదు. ఇప్పటివరకూ ఢిల్లీలో 56లక్షల 51వేల 226 డోసులు వ్యాక్సిన్ వేసుకుంటుండగా రెండు డోసులు వేసుకున్న వారు 12లక్షల 84వేల మంది.