దసరా: ముంబాదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు 

  • Publish Date - September 29, 2019 / 03:29 AM IST

భారతదేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలన్నీ భక్తుల కళకళలాడుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదం కోసం దేవాలయాలకు తరలివచ్చారు.  ఈ ఉత్సవాల్లో భాగంగా..ముంబైలో కొలువై ఉన్న ముంబా దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.  భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబాలను చల్లగా చూడు తల్లీ అని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముంబా మాత పేరిటనే బొంబాయి అని ముంబై అని పేరు వచ్చినట్టు చారిత్రక కథనం.

స్త్రీ శక్తికి ప్రతీకగా దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పరాశక్తిగా..దుర్గగా ఇలా అనేక రూపాలతో..పలు అంశాలతో సృష్టిని కాపాడే అమ్మవారు  భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటోంది. సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తుల్ని కూడా శాసించగల తల్లి ఆ ఆదిపరాశక్తి. ఛండీగా..ప్రఛండిగా..మహిషాసుర మర్థినిగా విజయదుర్గగా..సాక్షాత్తు మహాశివుడి భిక్షం వేసిన అన్నపూర్ణేశ్వరి ఆ  మహాశక్తి.  ఆ తల్లి ఎన్ని రూపాల్లో కొలిచినా భక్తులకు కల్పవల్లిగా కాపాడుతుంటుంది.