DGCA: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకమీద అదనపు చార్జీలు ఉండవు.. ఆ సేవలు కూడా ఉచితం
విమాన టికెట్ వాపసు, అదనపు ఛార్జీలపై డీజీసీఏ(DGCA) మార్పులు చేసింది.
- V Santhosh Kumar
- Published On : February 26, 2026 / 06:38 PM IST
DGCA makes changes on flight ticket refund, additional charges
- విమాన ప్రయాణికులకు డీజీసీఏ బంపర్ ఆఫర్
- అదనపు చార్జీల భారం తగ్గింపు
- టికెట్ లో మార్పుల సేవలు సులభతరం
DGCA: విమాన ప్రయాణికులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల రిఫండ్‌కు సంబంధించి ఎయిర్‌లైన్స్ నిబంధనలను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు టికెట్ బుక్ చేసి రద్దు చేసుకునే సమయంలో అదనపు ఛార్జీలు చెల్లించక్కర్లేదని సూచించింది. అలాగే, టికెట్‌లో మార్పు సేవలను సైతం ఉచితంగా చేసుకోవచ్చని తెలిపింది. దీంతో, ప్రయాణికులై అదనపు చార్జీల భారం తగ్గనుంది. అయితే, ఈ సేవలకు కొన్ని షరతులు వర్తిస్తాయని కూడా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. ఆ షరతులు ఏంటంటే?
- ప్రయాణికుడు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల పాటు విమానయాన సంస్థలు ‘లుక్- ఇన్’ ఆప్షన్ అందించాలి. ఈ సమయంలో మాత్రమే ప్రయాణికులు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా టికెట్ రద్దు, మార్పులు చేసుకోవచ్చు. కానీ, ఎంచుకున్న తేదీలో టికెట్ ధరలో మార్పులుంటే మాత్రం మార్పుల ప్రకారం చెల్లించాలి
- ట్రావెల్ ఏజెంట్/ వారి పోర్టల్స్ ద్వారా టికెట్ కొనుగోలు చేసినా రిఫండ్ బాధ్యత మాత్రం విమానయాన సంస్థలదే. 14 పని దినాల్లోగా ఆ చెల్లింపు పూర్తి చేయాల్సి ఉంటుంది. .
- విమానయాన సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు 24 గంటల్లోగా పేరులో మార్పులు ఉంటే చేసుకోవచ్చు. దానికి ఎలాంటి అదనపు ఛార్జీలను ఉండవు.
- దేశీయ విమానాల్లో ప్రయాణ తేదీ 7 రోజలు ఉండగా బుక్ చేసుకుంటే ఈ ‘లుక్-ఇన్ ఆప్షన్’ ఉండదు.
- అంతర్జాతీయ విమానాల్లో అయితే ఆ గడువు 15 రోజుల ఉండగా బుక్ చేసుకుంటే ‘లుక్-ఇన్ ఆప్షన్’ ఉండదు.
- మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ప్రయాణికుడు లేదా అదే పీఎన్‌ఆర్ నెంబరు ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రయాణ తేదీన ఆసుపత్రిలో ఉంటే రిఫండ్/ క్రెడిట్ షెల్ ఆప్షన్ కోరవచ్చు.
- వేరే ఏ ఇతర అనారోగ్య, అత్యవసర పరిస్థితుల్లో అయినా ప్రయాణికుల అభ్యర్థన మేరకు ఏరో స్పేస్ మెడిసిన్ నిపుణుడు లేదా డీజీసీఏ ఎంప్యానెల్డ్ ఏరో స్పేస్ మెడిసిన్ సలహా ఆధారంగా కూడా రిఫండ్ జారీ చేసే అవకాశం కల్పించారు.
