Bombay HC: కట్నం తీసుకున్న తర్వాత ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉంటుందా? బాంబే హైకోర్టు తాజా తీర్పు ఏంటంటే?

సెప్టెంబర్ 8, 1990 నాటి బదిలీ దస్తావేజును ఆమె తల్లి, సోదరులు వ్యతిరేకించారు. ఈ దస్తావేజు ఆధారంగానే ఆమె ఇద్దరు సోదరులకు ఆస్తి బదిలీ జరిగింది. అయితే దానిని చెల్లనిదిగా ప్రకటించాలని పిటిషనర్ కోరింది. రాతపూర్వకుంగా తానిచ్చే అనుమతి లేకుండా తన ఆస్తిని తన సోదరులను బదిలీ చేయకుండా శాశ్వత నిషేధం విధించాలని కోర్టును కోరింది

Bombay HC: కుమార్తెకు కుటుంబ ఆస్తి (Family property)లో భాగం ఉంటుందని విషయం తెలిసిందే. అయితే కట్నం (Dowry) తీసుకున్న తర్వాత కూడా కుమార్తెకు ఆస్తి మీద హక్కు ఉంటుందా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయమై అనేక సందర్భాల్లో కుటుంబాల్లో గొడవలు కూడా జరుగుతుంటాయి. అయితే దీనిపై బాంబే హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. “తెరెజిన్హా మార్టిన్స్ డేవిడ్ వర్సెస్ మిగ్యుల్ గార్డా రోసారియో మార్టిన్స్ & అదర్స్” (Terezinha Martins David vs. Miguel Guarda Rosario Martins & Others) కేసులో విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు (Bombay Highcourt)లోని గోవా బెంచ్ (Goa bench).. వివాహ సమయంలో కట్నం ఇచ్చినప్పటికీ కుటుంబ ఆస్తిపై కుమార్తె హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.

Hyderabad : దేశవ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత డేటా చోరీ.. ఆరుగురు అరెస్ట్

“ఇంటి ఆడపిల్లలకు కట్నం ఇచ్చారన్నదానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే, కుమార్తెలకు కొంత కట్నం అందించారనే కారణంతో కుటుంబ ఆస్తిలో కుమార్తెలకు ఎలాంటి హక్కు లేదని దీని అర్థం కాదు” అని జస్టిస్ ఎంఎస్ సోనక్ ధర్మాసనం పేర్కొంది. నలుగురు సోదరులు, నలుగురు సోదరీమణులు సహా 10 మంది ఉన్న ఒక కుటుంబంలో కుమార్తె అనుమతి లేకుండానే ఆమె సోదరులకు ఆస్తి బదిలీ చేశఆరు. దీనిపై పెద్ద కుమార్తె కోర్టును ఆశ్రయించారు. తన దివంగత తండ్రి ఆంటోనియో మార్టిన్స్ ఆస్తిలో ఆమెకు వాటా ఉంటుందని చెప్తూ ఆమెను ఆస్తి వారసురాలిగా కోర్టు ప్రకటించింది.

Rahul Gandhi: అదే జరిగితే ఇక రాహుల్ రాజకీయం జీవితం చిక్కుల్లో పడ్డట్టే

సెప్టెంబర్ 8, 1990 నాటి బదిలీ దస్తావేజును ఆమె తల్లి, సోదరులు వ్యతిరేకించారు. ఈ దస్తావేజు ఆధారంగానే ఆమె ఇద్దరు సోదరులకు ఆస్తి బదిలీ జరిగింది. అయితే దానిని చెల్లనిదిగా ప్రకటించాలని పిటిషనర్ కోరింది. రాతపూర్వకుంగా తానిచ్చే అనుమతి లేకుండా తన ఆస్తిని తన సోదరులను బదిలీ చేయకుండా శాశ్వత నిషేధం విధించాలని కోర్టును కోరింది. అయితే పిటిషనర్ సోదరులు కోర్టు ముందు వాదనలు వినిపిస్తూ వివాహ సమయంలో నలుగురు సోదరీమణులకు “తగినంత కట్నం” అందించామని తెలిపారు. అయితే వీరి వాదనలు కోర్టు కొట్టివేసింది. కుమార్తెకు ఆస్తిలో వాటా ఉంటుందని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు