Rahul Gandhi: అదే జరిగితే ఇక రాహుల్ రాజకీయం జీవితం చిక్కుల్లో పడ్డట్టే

అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి ఒక ఊరట కలిగించే అంశం ఉంది. పై కోర్టులు కనుక సూరత్ కోర్టు (Surat Court) తీర్పును కొట్టివేస్తే పదవీ గండం నుంచి రాహుల్ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ (Congress Party) నిర్ణయించడం ఇందుకు సహకరించవచ్చు.

Rahul Gandhi: అదే జరిగితే ఇక రాహుల్ రాజకీయం జీవితం చిక్కుల్లో పడ్డట్టే

Can Rahul Gandhi lose his Lok Sabha membership after latest conviction

Rahul Gandhi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటి పేరు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రెండేళ్ల జైలు శిక్ష పడ్డ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత వేటు (disqualification) పడే అవకాశం ఉంది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ (Lokh sabha) ఆయనపై వెంటనే చర్యలు కూడా తీసుకోవచ్చని కూడా అంటున్నారు. ఇదే జరిగితే రాహుల్ రాజకీయ జీవితం చిక్కుల్లో పడ్డట్లే అంటున్నారు. ఇలా అయితే ప్రస్తుతం కేరళలోని వయనాడ్ (Wayanad) లోక్‭సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్.. తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఇంటి దొంగల బాగోతం.. 12 మంది నిందితులు అరెస్ట్

అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి ఒక ఊరట కలిగించే అంశం ఉంది. పై కోర్టులు కనుక సూరత్ కోర్టు (Surat Court) తీర్పును కొట్టివేస్తే పదవీ గండం నుంచి రాహుల్ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ (Congress Party) నిర్ణయించడం ఇందుకు సహకరించవచ్చు. రాహుల్‌పై సూరత్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మ్లలికార్జున ఖర్గే (Congress chief Kharge) చెప్పారు. బీజేపీ ఇలా చేస్తుందని తాము ముందే ఊహించామన్నారు. రాహుల్ నోరు నొక్కడానికే ఇలా చేశారని ఖర్గే విమర్శించారు.

TSPSC paper leak: నాకు ఇచ్చినట్లే కేటీఆర్ కూ నోటీసులు ఇవ్వాలని ఫిర్యాదు చేశాను: రేవంత్ రెడ్డి

కాగా, కోర్టు తీర్పు అనంతరం రాహుల్ స్పందించారు. ‘నా మతం సత్యం, అహింస’ అని వ్యాఖ్యానించారు. ‘నా మతం సత్యం, అహింస’ అన్న మహాత్మ గాంధీ (Mahatma Gandhi) వ్యాఖ్యలను రాహుల్ ప్రస్తావించారు. తన అధికారిక ట్విట్టర్ (Twitter) ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘నా మతం సత్యం మీద అహింస మీద ఆధారపడి ఉంది. సత్యమే నా నిజమైన దేవుడు, అహింస దానిని పొందే మార్గం’’ అని గాంధీ అన్న మాటల్ని ట్వీట్ చేశారు. తన సోదరుడు భయపడే రకం కాదని, భయపడబోడని రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) అన్నారు. నిజం చెప్పడమే తమ అలవాటని, ఎప్పటికైనా నిజమే చెబుతామని అన్నారు. రాహుల్ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక విమర్శించారు.

MLC Elections : ఏపీలో తుది దశకు చేరుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టడాన్ని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ (Susheel kumar modi) సమర్ధించారు. ఈ వ్యాఖ్యలు తనకు సైతం నష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల బెయిల్ ఇచ్చింది.