TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఇంటి దొంగల బాగోతం.. 12 మంది నిందితులు అరెస్ట్

టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. సిట్ అధికారుల విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇంటి దొంగల బాగోతం తవ్వేకొద్ది బయటపడుతోంది.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఇంటి దొంగల బాగోతం.. 12 మంది నిందితులు అరెస్ట్

TSPSC paper (5)

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. సిట్ అధికారుల విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇంటి దొంగల బాగోతం తవ్వేకొద్ది బయటపడుతోంది. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని సిట్ అరెస్టు చేసింది. తాజాగా మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో టీఎస్పీఎస్సీ(TSPSC) ఏఈ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా అరెస్టైన ముగ్గురిలో టీఎస్పీఎస్సీకి చెందిన షమీమ్ అనే మహిళ ఉద్యోగితో పాటు రమేష్, సురేష్ ఉన్నారు.

గ్రూప్-1 ప్రిలిమ్స్ లో టీఎస్పీఎస్సీకి చెందిన షమీమ్, రమేష్ కు 100కు పైగా మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. సాయంత్రం 12 మంది నిందితులను నాంపల్లి కోర్టులో సిట్ అధికారులు ప్రవేశ పెట్టనున్నారు. అయితే గ్రూప్1 పరీక్ష రాసిన 80 మంది టీఎస్పీఎస్సీ ఉద్యోగుల్లో పది మందికి 100కి పైగా మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అందులో రమేశ్, షమీమ్, సురేశ్ టాప్ మార్కులు సాధించినట్లు గుర్తించారు. ఈ ముగ్గురిలో రమేశ్ టీఎస్పీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, షమీమ్ టీఎస్పీఎస్సీ శాశ్వత ఉద్యోగి, సురేశ్ గతంలో టీఎస్పీఎస్సీ టెక్నికల్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసి బయటికి వెళ్లాడు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు

అలాగే రాజశేఖర్ తో సంబంధాలున్న 42 మందికి కూడా నోటీసులు జారీ చేశారు. కాగా, గురువారంతో 9 మంది నిందితుల సిట్ కస్టడీ ముగియనుంది. కాగా, పేపర్ లీకేజీ కేసులో TSPSC కమిషన్ అడుగడుగునా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యo కనిపిస్తోంది. లీకేజీ వ్యవహారంలో TSPSC కమిషన్ చేతులెత్తేసి చోద్యం చూస్తోంది. పూర్తి బాధ్యత సిట్ కి వదిలేసి కనీసం ఇంటర్నల్ విచారణ కూడా జరపలేదు. పోలీసుల విచారణ తప్పితే ఒక్క విషయాన్ని బయటికి వెలువరించలేదు. కాన్ఫిడెన్షియల్ విభాగాన్ని సెక్షన్ ఆఫీసర్ స్థాయి శంకర్ లక్ష్మికి అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి.

పేపర్ లీకేజీ అంశం బయటికి వచ్చాక అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారికి కాన్ఫిడెన్షియల్ విభాగం అప్పగించారు. ఇంతవరకు ఒక్క అధికారికి కూడా మెమో జారీ చేయలేదు. శాఖాపరమైన చర్యలకు వెనకాడటంపై పలు అనుమానాలు తావిస్తోంది. TSPSCలో మొత్తం 165 మంది ఉద్యోగులు ఉండగా, అందులో రెగ్యులర్ 83, అవుట్ సోర్సింగ్ 82 ఉన్నారు. సొంత కమిషన్ సభ్యులు 26 మంది పరీక్ష రాస్తే కనీస సెలవుల నిబంధనలను అధికారులు గాలికొదిలేశారు. TSPSC మొత్తాన్ని రద్దు చేయాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.