TSPSC paper leak: నాకు ఇచ్చినట్లే కేటీఆర్ కూ నోటీసులు ఇవ్వాలని ఫిర్యాదు చేశాను: రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) లీకేజీ కేసులో రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరై పలు వివరాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

TSPSC paper leak: నాకు ఇచ్చినట్లే కేటీఆర్ కూ నోటీసులు ఇవ్వాలని ఫిర్యాదు చేశాను: రేవంత్ రెడ్డి

Revanth Reddy

TSPSC paper leak: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) లీకేజీ కేసులో తనకు నోటీసులు ఇచ్చినట్లే మంత్రి కేటీఆర్ (KTR) కి కూడా ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులకు ఫిర్యాదు చేశానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ సిట్ ఆఫీస్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇవాళ తాను అధికారుల ముందు హాజరై, తాను చేసిన ఆరోపణలపై ఆధారాలను అందజేశానని చెప్పారు. తాను ఇచ్చిన ఫిర్యాదును ఫిర్యాదు అని కాకుండా, ఇన్ఫర్మేషన్ అని సిట్ చీఫ్ రాసుకున్నారని తెలిపారు. వ్యాపం కుంభకోణం ఇలాగే జరిగిందని, కాంగ్రెస్ దీనిపై న్యాయ పోరాటం చేస్తే కేసు సీబీఐకి బదిలీ అయిందని చెప్పారు. వ్యాపం కుంభకోణం విషయం కూడా ఏఆర్ శ్రీనివాస్ కి తెలియజేశానని అన్నారు. వ్యాపం కేసులో 2 వేల మందిని అరెస్ట్ చేశారని చెప్పారు.

టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో సీబీఐ విచారణ జరగాలని తెలిపారు. ఈడీ ఎంటర్ కావాలని, ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. ఈ కేసును సీబీఐ విచారించడానికి ఆదేశాలు ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఇందులో NRI లు పరీక్షలు రాశారని అన్నారు. ఈ స్కామ్ లో నగదు రూపంలో లావాదేవీలు జరిగాయని చెప్పారు. హవాలా ద్వారానే ఈ స్కామ్ జరిగిందని తెలిపారు. దీనిపై ఈడీ కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దీని వెనుక ఉన్న కుట్రలు బయట పడాలని చెప్పారు.

Hyderabad : దేశవ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత డేటా చోరీ.. ఆరుగురు అరెస్ట్