LPG cylinder Price hiked : సామాన్యులకు బిగ్‌షాక్.. మరోసారి పెరిగిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే..

LPG cylinder : దేశవ్యాప్తంగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 మేర పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నారు.

LPG cylinder Price hiked

  • మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
  • గృహ వినియోగ సిలిండర్‌పై రూ.29 పెంపు
  • మూడు నెలల వ్యవధిలో ఇది రెండోసారి

LPG cylinder Price hiked : దేశవ్యాప్తంగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 మేర పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. మూడు నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, ఇంధనం ధరలు పెరిగాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచి (జూన్ 7వ తేదీ) అమల్లోకి వచ్చాయి.

Also Read : AP Rains : ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు భీకర గాలులు.. పిడుగులతో కూడిన వర్షం.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు..

భారతదేశంలో మార్చి 7వ తేదీన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.60 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలకు నష్టాలు తప్పడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ గ్యాస్ ధరలు పెంపు అనివార్యమైందని చెబుతున్నారు. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.913 నుంచి రూ.942కు చేరింది.