Shrimp Industry
Trump Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. టారిఫ్‌లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం విధించిన టారిఫ్‌లు 25శాతం నుంచి 18శాతానికి తగ్గించారు.
Also Read : Gold Price : బంగారం, వెండి ధరల్లో గణనీయ మార్పు.. 2008 తరువాత ఇదే తొలిసారి.. ప్రధాన కారణాలివే.
గతంలో భారతదేశం ఉత్పత్తులపై 50శాతం సుంకాలను ట్రంప్ విధించిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో అతి ఎక్కువగా ప్రభావితమైన రంగాల్లో రొయ్యల ఎగుమతులు కూడా ఉన్నాయి. దీంతో గడిచిన మూడు నెలల కాలంలో అమెరికాకు రొయ్యల ఎగుమతులు 60శాతం తగ్గాయి. తాజాగా వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల అగ్ర నాయకుల నుంచి సానుకూల ప్రకటన రావడంతో రొయ్యల ఎగుమతులపై పరిశ్రమకు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
వాణిజ్య ఒప్పందం ఒక నెల రోజులోపుగా కుదిరితే ఎక్కువ ప్రయో జనం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీని వల్ల రొయ్యల ఎగుమతులకోసం ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి లేదా వచ్చే జనవరి నాటికి అడ్వాన్డ్స్ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని వీరు అభిప్రాయపడుతున్నారు.
2025లో మన దేశం నుంచి 8లక్షల టన్నుల రొయ్యల ఎగమతులు జరిగాయి. అమెరికాకు దాదాపు ఎగుమతులు నిలిచిపోయిన సమయంలో ఇతర మార్కెట్లకు రొయ్యల ఎగుమతులు జరిగాయి. ప్రధానంగా చైనా, రష్యా, వియత్నాం దేశాలకు వీటి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా చైనాకు సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రెండు రెట్లు పెరిగాయి. గత సంవత్సరం జులైలో 76 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు, నవంబర్ నాటికి 205 మిలియన్ డాలర్లకు పెరిగాయి.
అమెరికా 50శాతం సుంకాలు విధించిన తరువాత అమెరికాకు 1 బిలియన్ డాలర్ల విలువైన సముద్ర ఉత్పత్తులు, ప్రధానంగా రొయ్యల ఎగుమతులు తగ్గాయి. ఇతర పన్నులు కలిపి అమెరికా మార్కెట్లో దిగుమతులపై పన్నులు 58 శాతానికి చేరాయి. ప్రస్తుతం ట్రంప్ 18 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించడంతో అమెరికాకు జరిగే రొయ్యల ఎగుమతులపై అన్ని రకాల పన్నులు కలిపి 26 శాతంగా ఉండనున్నాయి.
రొయ్యల ఎగుమతుల విషయంలో అమెరికా మార్కెట్లో మనకు ఈక్విడార్ ప్రధాన పోటీ దారుగా ఉంది. ఈ దేశం రొయ్యల దిగుమతులపై అన్ని పన్నులు కలిపి 18.78 శాతంగా ఉండనున్నాయి. భారత్ తో పోల్చితే ఇప్పటికీ ఈక్విడార్‌కు అనుకూలంగానే మార్కెట్ ఉంటుంది. ఇతర పోటీదారులైన ఇండోనేసియాపై 24 శాతం, వియ త్నాంపై 19 శాతం సుంకాలు ఉన్నందున భారత్‌కు ప్రయోజనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆక్వారంగ నిపుణులు చెబుతున్నారు.