Earthquake: అండమాన్లో భూకంపం
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. తెల్లవారుఝామున 5 గంటల 31 నిమిషాలకు భూమి కంపించినట్లుగా వెల్లడించారు అధికారులు.
- vamsi
- Published on- December 29, 2021 / 11:18 AM IST
Earthquake (1)
Earthquake: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. తెల్లవారుఝామున 5 గంటల 31 నిమిషాలకు భూమి కంపించినట్లుగా వెల్లడించారు అధికారులు.
దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదవగా.. భూకంపం తీవ్రత అండమాన్ నికోబార్ ప్రాంతంలో 100 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ స్పష్టం చేసింది.
కొద్దిరోజుల క్రితం కూడా అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించగా.. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.9గా నమోదైంది.
పోర్ట్బ్లెయిర్ పట్టణానికి 202 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం అప్పట్లో భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
