Earthquake In Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.2గా నమోదు
హిమాచల్ ప్రదేశ్ లో స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి కంపించింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
- bheemraj
- Published On : January 14, 2023 / 10:04 AM IST
Earthquake
Earthquake In Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ వెల్లడించింది.
ధర్మశాలకు 76 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ అంతర్భాగంలో 5 కిలో మీటర్ల లోతులో భూ ప్రకంపణలు సంభవించాయని పేర్కొంది. స్వల్ప భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
Earthquake : జమ్ముకశ్మీర్ లో భూకంపం.. 10 రోజుల వ్యవధిలో మూడోసారి
అయితే ఉత్తరాఖండ్ లోని జోషీమఠ్ లో భూకంపం వచ్చిన మరుసటి రోజే ధర్శశాలలో భూమి కంపించింది. రోజు రోజుకు కుంగిపోతున్న జోషీమఠ్ లో శుక్రవారం తెల్లవారుజామున 2.12 గంటలకు 2.9 తీవ్రతతో ప్రకంపణలు వచ్చాయి.
