Earthquake : మూడు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
మణిపూర్‌లోని చందేల్‌లో గురువారం భూకంపం సంభవించింది. తెల్లవారు జామున 5 నుంచి 6 గంటల మధ్య భూమి పలు మార్లు కంపించింది.
- kunduru Vinod
- Published On : November 4, 2021 / 02:46 PM IST
Earthquake
Earthquake : మణిపూర్‌లోని చందేల్‌లో గురువారం భూకంపం సంభవించింది. తెల్లవారు జామున 5 నుంచి 6 గంటల మధ్య భూమి పలు మార్లు కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగినట్లుగా ఎటువంటి సమాచారం లేదని ఎన్‌సీఎస్ పేర్కొంది. ఈ భూకంపకేంద్రం మొయిరాంగ్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 57 కిలోమీటర్ల దూరంలో భూమికి 52 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు పేర్కొంది.
చదవండి : Earthquake: తెలంగాణలో భూకంపం.. ఆందోళనలో జనం
ఇదిలా ఉంటే హిమాచల్‌ప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. ఉదయం 6.25 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రతతో తొలి ప్రకంపనలు వచ్చాయి. ఆ తర్వాత 7.13 గంటలకు మరోసారి రిక్టర్ స్కేల్‌పై 2.4 తీవ్రత ప్రకంపనలు వచ్చాయని సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. గంట వ్యవధిలో రెండు సార్లు ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం.
చదవండి : Earthquake : తైవాన్‌లో భారీ భూకంపం
అస్సాంలో కూడా భూమి కంపించింది.. ఉదయం 10.19 గంటల సమయంలో సోనీపూర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది. ఇక ఇక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
