ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి.. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రా సమీపంలోని ఎత్మౌద్ధౌలాలో... జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
- bheemraj
- Updated on- March 11, 2021 / 12:06 PM IST
Eight killed in road accident : ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రా సమీపంలోని ఎత్మౌద్ధౌలాలో… జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కారు, ట్రక్కు ఢీకొనడంతో ప్రయాణీకులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.
కారు, ట్రక్కు వేగంగావెళ్తున్న సమయంలో ఢీకొన్నాయి. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… క్రేన్‌ను రప్పించారు.
క్రేన్ సహాయంతో కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను రక్షించారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. నలుగురు క్షతగాత్రులకు చికిత్స చేస్తున్నారు వైద్యులు.
