RajyaSabha Elections : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు.. తెలంగాణలో రెండు స్థానాలకు..

RajyaSabha Elections : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం ఉదయం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 37 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

RajyaSabha Elections

  • రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఎన్నికలు
  • తెలంగాణలో రెండు స్థానాలకు
  • ఈనెల 26న విడుదలకానున్న నోటిఫికేషన్‌

RajyaSabha Elections : త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 37 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు స్థానాలు ఉన్నాయి. ఈనెల 26వ తేదీన ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

Also Read : Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు.. తీర్థయాత్రల కోసం కూడా.. ఫుల్ డీటెయిల్స్ ఇలా..

షెడ్యూల్ ప్రకారం.. మార్చి 5వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. మార్చి 9వ తేదీ వరకు దరఖాస్తులు విత్ డ్రా చేసుకోవచ్చు. 16వ తేదీన ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆ రోజే సాయంత్రం 6గంటల తరువాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.

మొత్తం పది రాష్ట్రాల్లో సుమారు 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన ఎన్నికలు నిర్వహించనుంది. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఏడు మంది రాజ్యసభ ఎంపీలు తమ పదవీకాలాన్ని ఏప్రిల్ 2వ తేదీన పూర్తి చేసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేఆర్ సురేశ్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ఆ ఇద్దరి పదవీకాలం ముగియనుంది.

రాష్ట్రాల వారిగా వివరాలు ఇలా..
మహారాష్ట్రలో ఏడు, ఒడిశా రాష్ట్రంలో నాలుగు, తమిళనాడు రాష్ట్రంలో ఆరు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఐదు, అస్సాం రాష్ట్రంలో మూడు, బిహార్ రాష్ట్రంలో ఐదు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండు, హరియాణాలో రెండు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో రెండు స్థానాలకు మొత్తంగా పది రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.