తొండెంలో నీళ్లు నింపి ఒంటెపై చల్లిన ఏనుగు.. వీడియో వైరల్
- Sreehari A
- Updated on- October 8, 2020 / 09:57 PM IST
Elephant spray water camel : ఒంటెకు చల్లదనంగా ఉండాలని ఓ ఏనుగు తన తొండెంలో నీళ్లు నింపి దానిపై చిమ్మింది.. ఏనుగు, ఒంటె మధ్య చెలిమికి ఇదే నిదర్శనం.. ఒంటెను చూడగానే ఉత్సాహంతో ఏనుగు తన తొండెంతో నీళ్లను చల్లింది. నీళ్లు చిమ్మగానే చల్లగా హాయిగా అనిపించి ఒంటె పులకరించిపోయింది. థ్యాంక్యూ మిత్రమా అన్నట్టుగా ఏనుగు వైపు ఒరగా చూసింది..
11 సెకన్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను భారతీయ ఫారెస్ట్ సర్వీసెస్ కు చెందిన సుశాంతా నందా ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇందులో ఏనుగు నీళ్లను తన తొండెంలో నింపి పక్కనే ఉన్న ఒంటెపై గట్టిగా చిమ్మేసింది.
మిత్రమా సేద తీరు కాసేపు అయినా అంటూ ఏనుగు ఘీంకరించింది.. వీడియోను పోస్టు చేయగానే.. 3,400 లైక్స్, వందలాది రీట్వీట్లు వచ్చాయి. ఏనుగు ఎంత స్మార్ట్ కేరింగ్ యానిమల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
