Shubman Gill: ఎలాన్ మస్క్‌కు భారత్ యువ క్రికెటర్ ఆసక్తికర ట్వీట్.. వెంటనే రిప్లయ్ ఇచ్చిన స్విగ్గీ సంస్థ
ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు.. ఎలాన్ మస్క్.. టెస్లా సీఈవో మస్క్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్వీటర్‌ను కొనుగోలు చేసి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విటర్ కొనుగోలు చేసిన నాటి నుండి...
- Harishth Thanniru
- Published On : April 30, 2022 / 01:22 PM IST
Gill
Shubman Gill: ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు.. ఎలాన్ మస్క్.. టెస్లా సీఈవో మస్క్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్వీటర్‌ను కొనుగోలు చేసి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విటర్ కొనుగోలు చేసిన నాటి నుండి వరుస ట్వీట్‌లతో నెటిజన్లను కంగారెత్తిస్తున్నారు. మొన్న మెక్ డొనాల్డ్ ను కొంటానని చెప్పిన మస్క్, మరుసటి రోజు కోకాకోలాను కొనుగోలు చేస్తానంటూ నెటిజన్లకు షాకిచ్చాడు.
Elon musk, please buy swiggy so they can deliver on time. @elonmusk #swiggy
— Shubman Gill (@ShubmanGill) April 29, 2022
ఇలా ఏదోరూపంలో నెటిజన్లతో మస్క్ సంభాషిస్తూ హల్ చల్ చేస్తున్నాడు.. ఈ క్రమంలో భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మస్క్‌కు ఓ అభ్యర్థన పెట్టుకున్నాడు. దయచేసి ఫుడ్ డెలివరీ యాప్ స్వీగ్గీని కొనుగోలు చేయండి మాస్క్ అంటూ ట్వీట్ చేశాడు. అప్పుడు వారు సమయానికి ఫుడ్ డెలివరీ చేయగలరు అంటూ గిల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. గిల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే స్పందించిన స్విగ్గీ సంస్థ హాయ్ శుభ్ మన్ గిల్.. మేం సరిచూసుకునేందుకు ఒకసారి మీ ఆర్డర్ వివరాలు పంపండి అని రీ ట్వీట్ చేశారు.. ఆ తరువాత గిల్ వివరాలు పంపినట్లు స్వీగ్గీ సంస్థ తెలిపింది.
Swiggy Boy: ప్రేమికుల మధ్య గొడవ: పరిష్కరించడానికి వెళ్లి యువతిని కొట్టిన స్విగ్గీ డెలివరీ బాయ్
గిల్ ట్వీట్ కు పలువురు నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. టీ 20 క్రికెట్ లో మీరు చేస్తోన్న బ్యాటింగ్ కంటే మేం ఇంకా వేగంగా ఉన్నాం అంటూ ఓ నెటిజన్ రీ ట్వీట్ చేశాడు. ఒక్క రోజు డెలివరీ బాయ్ గా పనిచేయండి, అప్పుడు వారి కష్టాలు తెలుస్తాయంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇలా 2వేల మంది వరకు రీ ట్వీట్లు చేయగా.. అందులో కొందరు గిల్ కు కౌంటర్లు ఇస్తుండగా, మరికొందరు గిల్ కు మద్దతుగా రీ ట్వీట్లు చేశారు.
