Dhanush Political Entry : ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ.. వెండి దీపాలపై కమలం గుర్తుతో కొత్త రచ్చ!

Dhanush Political Entry : ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా? మహిళా కార్యకర్తలకు పంపిణీ చేసిన వెండి దీపాలపై కమలం గుర్తు వివాదం, అభిమాన సంఘం వివరణ, తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఊహాగానాలపై పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Dhanush Political Entry

  • వెండి దీపాలపై కమలం.. ధనుష్ రాజకీయ ఎంట్రీపై కొత్త చర్చ
  • దీపావళి గిఫ్ట్‌తో పొలిటికల్ హీట్.. ధనుష్ టార్గెట్ ఎవరు?
  • ధనుష్ చేతిలో వెండి దీపాలు.. కమలం గుర్తుపై క్లారిటీ

Dhanush Political Entry : తమిళనాట రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా? వెండితెరపై తనదైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న స్టార్ హీరో ధనుష్.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారారు. ఆయన నిర్వహించిన అభిమానుల సమావేశం.. మహిళా కార్యకర్తలకు అందించిన వెండి దీపాలు.. వాటిపై కనిపించిన కమలం గుర్తు.. వెరసి తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు మొదలవ్వగా.. ఈ వ్యవహారంపై ఆయన అభిమాన సంఘం ఇచ్చిన వివరణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ కమలం గుర్తు వెనుక అసలు కథేంటి? అనేది తెలుసుకుందాం..

వెండి దీపాలే వివాదానికి కారణమా? :
చెన్నైలోని సెమ్మంచేరి ప్రాంతంలో ఆదివారం ధనుష్ నర్పణి ఇయక్కం ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన మహిళలకు ధనుష్ వెండి కామాక్షి దీపాలను బహుమతిగా అందించారు.

అయితే, వాటిపై ఉన్న కమలం గుర్తును చూసిన కొందరు రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీతో ధనుష్‌కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే చర్చ మొదలైంది..

Read Also : Elon Musk X Money : ఎక్స్‌లో సరికొత్త ఫీచర్.. మీకు పోస్టు నచ్చిందా?.. లైక్ బటన్‌తోనే డబ్బులు పంపొచ్చు.. ఎలాగంటే?

ఈ ఊహాగానాలపై ధనుష్ నర్పణి ఇయక్కం ప్రతినిధి స్పందిస్తూ.. దీపాలపై ఉన్న కమలం గుర్తు తయారీదారుకు సంబంధించినదేనని స్పష్టం చేశారు. దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని, ఇతర పార్టీలతో సంబంధాలున్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు.

రాజకీయ అరంగేట్రంపై ఆసక్తి :
ధనుష్ త్వరలో ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని పెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, దీనిపై ధనుష్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనా కూడా స్పష్టత లేదు.

ఈ సమావేశానికి సుమారు 3వేల నుంచి 5వేల మందికి పైగా మహిళలు హాజరైనట్లు అంచనాలు ఉన్నాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మొదలైంది. గంటల తరబడి వేచి చూసిన అభిమానులకు ధనుష్ కొద్దిసేపే ప్రసంగించారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపి, బాగా చదువుకోవాలని, సురక్షితంగా ఇళ్లకు వెళ్లాలని సూచించారు.

మరోవైపు, అభిమాన సంఘాలను ఒకే సంస్థ కిందకు తీసుకొస్తూ రాష్ట్రవ్యాప్తంగా కొత్త నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు రాజకీయ ప్రవేశంపై ఆసక్తిని పెంచుతున్నా ధనుష్ అసలు ఆలోచన ఏమిటన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది..