Emergency in 1975: కోర్టులకు ఉన్న ఆ లక్షణమే ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడింది: సీజేఐ డీ.వై చంద్రచూడ్

గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ సంస్థల స్వభావం మారిపోయింది. మన పనితీరులో సాంకేతికత వినియోగం పెరుగుతోంది. కోవిడ్ మహమ్మారి కాలంలో సాంకేతికత లేకుంటే మనం పని చేసేవాళ్లం కాదు. మహమ్మారి సమయంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను కూల్చివేయకూడదు. మేము టెక్నాలజీతో సౌకర్యంగా లేకపోయినా సాంకేతికతను ఉపయోగించడం ముఖ్యం. కోర్టుల పనితీరులో సాంకేతికత పెరుగుదలను అందరూ ప్రోత్సహించాలి

Fearless sense of independence of courts saved democracy during Emergency says CJI Chandrachud

Emergency in 1975: ఎమర్జెన్సీ(1975) సమయంలో కోర్టులకు ఉన్న నిర్భయ స్వాతంత్ర్యమే ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని భారత ప్రధాన న్యాయమూర్తి డీ.వై చంద్రచూడ్ అన్నారు. నవంబర్‌లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సీజేఐ చంద్రచూడ్‌ను బాంబే హైకోర్టు శనివారం ఘనంగా సత్కరించింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలో గతంలో పలువురు న్యాయమూర్తుల గురించి, వారితో కలిసి పనిచేసిన అనుభవం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.

Bihar: తేజశ్వీ యాదవ్‭ని ఇప్పుడే ముఖ్యమంత్రి చేయండి.. నితీశ్ కుమార్‭కు పీకే సలహా

‘‘1975లో ఎమర్జెన్సీ కాలంలో మసకబారిన స్వాతంత్య్ర జ్యోతిని రాణే లాంటి న్యాయమూర్తులు వెలిగించారు. 1975లో భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడింది మన న్యాయస్థానాల నిర్భయ స్వాతంత్య్ర భావమే. మన కోర్టులకు ఉన్న బలమైన సంప్రదాయం, బార్‌లోని న్యాయమూర్తులందరూ ఒకే జెండా కిందకు చేరండ. మన కోర్టులు స్వేచ్ఛను కాపాడే జ్యోతిలాగా ఎప్పుడూ ప్రజ్వలిస్తూనే ఉంటూ వచ్చాయి. అందుకే భారత ప్రజాస్వామ్యం దృఢంగా ఉంది’’ అని సీజేఐ అన్నారు.

Indian-China Clash: పీఎం కేర్స్‭కు చైనా నుంచి నిధులు? ప్రధాని మోదీకి కాంగ్రెస్ 7 ప్రశ్నలు

“గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ సంస్థల స్వభావం మారిపోయింది. మన పనితీరులో సాంకేతికత వినియోగం పెరుగుతోంది. కోవిడ్ మహమ్మారి కాలంలో సాంకేతికత లేకుంటే మనం పని చేసేవాళ్లం కాదు. మహమ్మారి సమయంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను కూల్చివేయకూడదు. మేము టెక్నాలజీతో సౌకర్యంగా లేకపోయినా సాంకేతికతను ఉపయోగించడం ముఖ్యం. కోర్టుల పనితీరులో సాంకేతికత పెరుగుదలను అందరూ ప్రోత్సహించాలి” అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

Penis-headed statue of Putin: ఇంగ్లాండులో రష్యా అధ్యక్షుడు పుతిన్ అశ్లీల విగ్రహం.. కొడిగుడ్లు విసురుతున్న స్థానికులు

బాంబే హైకోర్టు గురించి CJI మాట్లాడుతూ ‘‘భవిష్యత్తు కోసం చట్టాన్ని రాయడం, రూపొందించడం, నిర్దేశించడంలో బాంబే హైకోర్టుకు అంటూ ప్రత్యేకమైన బలం, శక్తి ఉంది. బాంబే హైకోర్టుకి అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడానికి మేము చేయగలిగినంత చేయడం అవసరం. అక్కడ బార్‌కు మెంటర్‌షిప్ అందించడంలో న్యాయమూర్తులు కీలక పాత్ర పోషిస్తారని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు.