Penis-headed statue of Putin: ఇంగ్లాండులో రష్యా అధ్యక్షుడు పుతిన్ అశ్లీల విగ్రహం.. గుడ్లు విసురుతున్న బాటసారులు

పది నెలల నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దళాలు చేసిన దాడికి నిరసనగా ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. డిసెంబరు 15న ఇది వెలుగులోకి వచ్చింది. విగ్రహన్ని రోడ్డు మీదే ఏర్పాటు చేసి, ఆ పక్కనే గుడ్ల డబ్బాలను ఏర్పాటు చేశారు. వచ్చిపోయే బాటసారులు ఆ గుడ్లున పుతిన్ విగ్రహంపైకి విసిరేందుకు వీలుగా వాటిని అక్కడ ఉంచారు.

Penis-headed statue of Putin: ఇంగ్లాండులో రష్యా అధ్యక్షుడు పుతిన్ అశ్లీల విగ్రహం.. గుడ్లు విసురుతున్న బాటసారులు

Penis-headed statue of Putin erected in UK village

Penis-headed statue of Putin: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల ఓవైపు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంపై ప్రపంచం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా ఇరు దేశాలు వినడం లేదు. ముఖ్యంగా రష్యా వైఖరి పట్ల ప్రపంచంలోని చాలా దేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‭పై బహిరంగంగానే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లోని ఓ గ్రామంలో పుతిన్‭ను వ్యతిరేకిస్తూ ఓ అశ్లీల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Indian-China Clash: పీఎం కేర్స్‭కు చైనా నుంచి నిధులు? ప్రధాని మోదీకి కాంగ్రెస్ 7 ప్రశ్నలు

తలపై పురుషాంగంతో ఉన్న పుతిన్ విగ్రహాన్ని ఇంగ్లాండ్‌లోని బెల్ ఎండ్ అనే గ్రామంలో ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి “బెల్లెండ్ ఆఫ్ ది ఇయర్” అనే శాసనాన్ని చేశారు. ‘బెల్లెండ్’ అంటే బాధించే లేదా తెలివితక్కువ వ్యక్తికి ఆంగ్లంలోని ఓ యాసలో అర్థం. ఇక ఈ విగ్రహానికి తమదైన శైలిలో సన్మానం చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గుడ్లను ఆ విగ్రహంపైకి విసురుతూ తమ ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

Pathaan: మరో వివాదంలె ‘పఠాన్’ సినిమా.. హిందువులు కాదు, ఈసారి ముస్లింలే బ్యాన్ చేయాలంటున్నారు

పది నెలల నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దళాలు చేసిన దాడికి నిరసనగా ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. డిసెంబరు 15న ఇది వెలుగులోకి వచ్చింది. విగ్రహన్ని రోడ్డు మీదే ఏర్పాటు చేసి, ఆ పక్కనే గుడ్ల డబ్బాలను ఏర్పాటు చేశారు. వచ్చిపోయే బాటసారులు ఆ గుడ్లున పుతిన్ విగ్రహంపైకి విసిరేందుకు వీలుగా వాటిని అక్కడ ఉంచారు. విగ్రహ నిర్వాహకులు మాట్లాడుతూ ‘‘బెల్లెండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎవరికైనా అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం విశ్వవ్యాప్తంగా బెలెండ్‌గా నిలిచిన వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్” అని పేర్కొన్నారు.

North Korea: మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించి కలకలం రేపిన ఉత్తర కొరియా

విగ్రహానికి మంచి ఆదరణ లభించిందని, ప్రజలు ఇష్టపూర్వకంగా విగ్రహంపై గుడ్లు విసిరి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఉక్రేనియన్ శరణార్థులకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థ కోసం డబ్బును సేకరించడానికి విగ్రహ చిత్రాలను విక్రయించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఏడాది వ్యవధిలో ఉక్రెయిన్‌లో జరిగిన విధ్వంసాన్ని చూసిన తర్వాత తమ వంతు సాయం చేయాలని కోరుకుంటున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.