North Korea: మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించి కలకలం రేపిన ఉత్తర కొరియా

North Korea: మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించి కలకలం రేపిన ఉత్తర కొరియా

North Korea's History That 8 Missiles Have Been Fired In A Single Day (1)

North Korea: ఉత్తర కొరియా ఇవాళ ఉదయం ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఇటీవలే దక్షిణ కొరియా వైపు శతఘ్ని గుళ్లతో ఉత్తర కొరియా భారీగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి వైపుగా ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించిందని జపాన్ తెలిపింది. శరవేగంగా, వ్యూహాత్మకంగా దూసుకెళ్లే సామర్థ్యం ఉండే క్షిపణులను ఉత్తర కొరియా అభివృద్ధి చేసుకుంటోంది.

తన అణ్వస్త్ర, క్షిపణుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ప్రణాళికలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా మరో ఖండాంతర క్షిపణిని ప్రయోగించిందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ప్రయోగించిన క్షిపణి గురించి మరిన్ని విషయాలపై ఆరా తీస్తున్నారు. క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు.

తమకు వ్యతిరేకంగా అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు ఏవైనా చర్యలకు పాల్పడితే అణ్వాయుధాలతో సమాధానం ఇస్తామంటూ కిమ్ జోంగ్ ఉన్ ఇప్పటికే హెచ్చరికలు చేశారు. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలూ చేపట్టనుందని ఇప్పటికే అమెరికా నిఘా వర్గాలు చెప్పాయి. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ అప్రమత్తమై పలు చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ వెనక్కు తగ్గకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ ఆయా దేశాలను ఉత్తర కొరియా హెచ్చరించింది.

Pathaan: మరో వివాదంలె ‘పఠాన్’ సినిమా.. హిందువులు కాదు, ఈసారి ముస్లింలే బ్యాన్ చేయాలంటున్నారు