Rahul Gandhi : ఈవెంట్ ఖతం..వ్యాక్సినేషన్ రికార్డ్‌పై రాహుల్ సెటైర్
వ్యాక్సినేషన్ ప్రక్రియ రికార్డు స్థాయిలో జరుగుతోందన్న కేంద్రం ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
- venkaiahnaidu
- Published On : September 19, 2021 / 08:13 PM IST
Rahul
Rahul Gandhi వ్యాక్సినేషన్ ప్రక్రియ రికార్డు స్థాయిలో జరుగుతోందన్న కేంద్రం ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ఈవెంట్ ఖతం(ఈవెంట్ ముగిసింది)'”అని ఆదివారం రాహుల్ ఓ ట్వీట్ చేశారు. 10 రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా ఉందో తెలిపే కొవిన్ వెబ్సైట్ గ్రాఫ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు రాహుల్ గాంధీ.
గత శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది. ఒక్కరోజే 2. 5 కోట్ల మందికి టీకాలిచ్చారు. రికార్డు పంపిణీ అనంతరం శనివారం వ్యాక్సినేషన్ ప్రక్రియ పడిపోవడమేంటని రాహుల్ ప్రశ్నించారు.
శుక్రవారంతో పోల్చితే శనివారం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తారని భావించినట్లు రాహుల్ ట్వీట్లో పేర్కొన్నారు. 2.1 కోట్ల డోసులు మళ్లీ ఎప్పుడిస్తారో అని వేచిచూస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ స్థాయిలో వాక్సిన్ పంపిణీ జరగడం చాలా అవసరమని గుర్తుచేశారు.
READ Vaccination Record: మోడీ పుట్టినరోజు నాడే దేశంలో వ్యాక్సినేషన్ రికార్డ్..
READ Punjab CM : పంజాబ్ సీఎంగా ఎన్నికైన చరణ్‌జీత్ సింగ్ చన్నీ
