Punjab CM : పంజాబ్ సీఎంగా ఎన్నికైన చరణ్​జీత్ సింగ్ చన్నీ

పంజాబ్ సీఎం ఎంపికలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి.

Punjab CM : పంజాబ్ సీఎంగా ఎన్నికైన చరణ్​జీత్ సింగ్ చన్నీ

Charan

Punjab CM పంజాబ్ సీఎం ఎంపికలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ కొనసాగుతున్న ఉత్కంఠకు తెరలేపుతూ, తదుపరి ముఖ్యమంత్రి పేరు వెల్లడించారు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ హరీష్ రావత్.

పంజాబ్ సీఎంగా ఈసారి ఎస్సీ నేతకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్ఠానం. పంజాబ్​ కొత్త సీఎంగా చరణ్​జీత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుందని ఆదివారం సాయంత్రం హరీష్ రావత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆదివారం ఆయన పంజాబ్ సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. అంతకుముందు సుఖ్​జిందర్ సింగ్​​ రంధావాను సీఎంగా ఖరారుగా చేశారని వార్తలొచ్చాయి. కానీ రావత్ ట్వీట్​తో సందిగ్ధం వీడింది.

చరణ్​జీత్ ప్రస్తుతం సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్​ను కలిసి లేఖ అందించనున్నారు హరీశ్​ రావత్​. సాయంత్రం 6:30 గంటలకు ఈ భేటీ జరగనుంది.

కాగా,పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ సీఎం పదవికి శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల పంజాబ్ పీసీసీ పగ్గాలు నవజోత్ సింగ్ సిద్దూకి అప్పగించడంపై అమరీందర్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సిద్దూ,అమరీందర్ మధ్య చాలాకాలం పాటు కోల్డ్ వార్ నడిచింది.దీంతో ఇద్దరినీ ఢిల్లీకి పిలిచి సయోధ్య కుదిర్చే ప్రయత్నం జరిగింది. అయితే ఇటీవల ఈ కోల్డ్‌వార్ సద్దుమణిగినట్లు కనిపించినప్పటికీ… తాజా పరిస్థితులు గమనిస్తుంటే ఇరువురి మధ్య గ్యాప్ ఇంకా కొనసాగుతున్నట్లుగానే ఉంది. సిద్దూ ప్రోద్బలంతోనే అమరీందర్ సింగ్‌ వ్యతిరేక వర్గం ఆయనపై తిరుగుబాటు చేస్తూ వస్తోందనే వాదన ఉంది.

తాజాగా అమరీందర్ వ్యతిరేక వర్గం అధిష్ఠానానికి లేఖ రాయడం వెనుక కూడా సిద్దూ హస్తం ఉందనే వాదన లేకపోలేదు. అటు అమరీందర్ సింగ్ కూడా అధిష్టానం తన ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తోందనే భావనలోనే ఉన్నారు.ఇంత ఒత్తిడి నడుమ సీఎంగా కొనసాగడం కంటే రాజీనామా చేయడమే ఉత్తమమని ఆయన భావించినట్లు తెలుస్తోంది.

సగానికి పైగా ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉండటం, పార్టీ హైకమాండ్‌ ఒత్తిడి చేయడంతో అమరీందర్ కు విధిలేని పరిస్థితులు ఎదురయ్యాయి. బలాన్ని తెలుసుకోవడానికి తన ఫామ్‌హౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పంపిస్తే 13 మంది ఎమ్మెల్యేలే వచ్చారు. దాంతో ఆయనకు సీఎల్‌పీలో ఎదురయ్యే పరిస్థితి ఏంటో అర్థమైంది. అందుకే పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ సీఎం పదవికి శనివారం రాజీనామా చేశారు.

READ Vijay: తల్లిదండ్రులపై కేసు పెట్టిన హీరో విజయ్.. కారణం ఇదే!