×
Ad

Union Budget 2026 : కేంద్ర బడ్జెట్‌-2026.. ఆంధ్రప్రదేశ్‌లో రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటుకు ఆమోదం.. ప్రత్యక్షప్రసారం

Union Budget 2026: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.

Union Budget 2026

Union Budget 2026: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.
మూడు కర్తవ్యాలతో ఈ బడ్జెట్ ను తీర్చిదిద్దామని చెప్పారు.
పోటీతత్వాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, నిలబెట్టడం.
మన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం.
ప్రతి కుటుంబం, సమాజం, ప్రాంతం, వనరులు, అవకాశాలను పొందేలా చూసుకోవడం వంటి మూడు కర్తవ్యాలతో ఈ బడ్జెట్ ను తీర్చిదిద్దామని చెప్పారు.

ఆరు లక్ష్యాలు ..
♦ వ్యూహాత్మక రంగాలలో తయారీని పెంచడం
♦ ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రియల్ సెక్టార్ కి పునరుజ్జీవం
♦ ఛాంపియన్ MSMEలను సృష్టించడం
♦ దీర్ఘకాలిక భద్రత, రక్షణను దృష్టిలో పెట్టుకోవడం
♦ దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కొనసాగించడం
♦ వ్యూహాత్మక ఆర్థిక ప్రాంతాలను (ఎకనామిక్ రీజియన్స్) అభివృద్ధి చేయడం

ఖనిజ సంపద కలిగిన ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అరుదైన భూమి కారిడార్లను (రేర్ ఎర్త్ కారిడార్స్) ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.
రాబోయే ఐదేళ్లలో రూ.10,000 కోట్లతో గ్లోబల్ బయోఫార్మా తయారీ కేంద్రం, బయోలాజిక్స్, బయోసిమిలర్లు దేశీయంగా ఉత్పత్తి చేస్తామని అన్నారు.

సెమీ కండక్టర్ మిషన్ కోసం రూ.40,000 కోట్ల కేటాయించినట్లు.. రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.

ముంబై – పుణె, ఫుణె – హైదరాబాద్, హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్ – చెన్నై, ఢిల్లీ – వారణాశి, వారణాశి – సిలిగుడి నగరాల మధ్య హై‌స్పీడ్ కారిడార్లు ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతేడాది రూ.11.2 లక్షల కోట్లు కేటాయించారు.

హై క్వాలిటీ, తక్కువ ధర ఉండే స్పోర్ట్స్ గూడ్స్ ఎగుమతులపై ఫోకస్ పెట్టామని నిర్మలా సీతారామన్ అన్నారు. గ్లోబల్ హబ్‌గా ఎదిగేందుకు ఇండియాకు అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.