Abhijeet Dipke: CJP అధినేత అభిజీత్ దీప్కేపై కేసు.. హెడ్‌మాస్టర్‌కు బెదిరింపులు.. పోలీసుల సీరియస్ యాక్షన్
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijeet Dipke)పై మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో పోలీసులు విధులకు అంతరాయం కలిగించినందుకు కేసు నమోదు చేశారు.
- V Santhosh Kumar
- Published on- August 22, 2026 / 09:23 PM IST
Fir against cjp founder abhijeet dipke for disrupting latur school
- అనుమతి లేకుండా పాఠశాలలో ప్రత్యక్షం
- తరగతి గది విధులకు అంతరాయం
- ఉపాధ్యాయులపై బెదిరింపుల ఆరోపణలు
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijeet Dipke)తో పాటు మరికొందరిపై మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో పోలీసులు విధులకు అంతరాయం కలిగించినందుకు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించి, తరగతుల నిర్వహణకు విఘాతం కలిగించడమే కాకుండా ఉపాధ్యాయులను బెదిరించారనే తీవ్ర ఆరోపణలతో ఆసా పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. జవళి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయురాలు సయ్యద్ షమ్షద్‌బానో ఖైరతాలీ (53) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అధికారిక చర్యలు చేపట్టారు.
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే నా బలం.. ‘ఛత్రోన్ కీ గూంజ్’లో రాహుల్ హాట్ కామెంట్స్
‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారం వేళ వివాదం:
సీజేపీ చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా అభిజీత్ దీప్కే బృందం లాతూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ, అక్కడ విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తోంది. అయితే, జవళి పాఠశాల పర్యటన సమయంలో ఆయన అనుమతి లేకుండా తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల మధ్య కూర్చొని వారిని ప్రశ్నించడం వల్ల అధికారిక విధులకు తీవ్ర విఘాతం కలిగిందని ఉపాధ్యాయురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ జరిగిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులకు బెదిరింపులు.. బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు:
పాఠశాల సందర్శన సమయంలో ఇతర పాఠశాలల నుంచి విద్యార్థులను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారని దీప్కే ఆరోపించారని, అంతేకాకుండా అక్కడి ఉపాధ్యాయులను విధుల నుంచి సస్పెండ్ చేయిస్తానని బెదిరించారని ఫిర్యాదులో వివరించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు స్పందించి, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 132, 329(3), 351(2), 356(2) కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
