కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి.. కొందరైతే బిల్డింగ్ పై నుంచి దూకి..
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని అలీగంజ్ ప్రాంతంలో శనివారం ఘోర అగ్నిప్రమాదం(Fire Accedent) సంభవించింది.
- V Santhosh Kumar
- Updated on- June 22, 2026 / 07:00 PM IST
Fire accident at a prominent coaching center in the Aliganj area of __Uttar Pradesh
- లఖ్‌నవూ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం.
- ప్రాణాలు కాపాడుకోవడానికి విద్యార్థులు దూకారు.
- ఘటనా స్థలంలో సహాయక చర్యలు.
Fire Accedent: ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని అలీగంజ్ ప్రాంతంలో శనివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఒక మూడంతస్తుల భవనంలో నడుస్తున్న ప్రముఖ కోచింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద సమయంలో భవనంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు(Fire Accedent) వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకుని ఊపిరాడక లోపల ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు 11 మంది చనిపోయారని సమాచారం.
Keir Starmer: యూకే ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా..
ఈ ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు విద్యార్థులు సాహసానికి ఒడిగట్టారు. భవనం పైఅంతస్తుల కిటికీల నుండి, పైకప్పు నుండి కిందకు దూకుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భవనం కింది భాగంలో మొదలైన మంటలు, నిమిషాల వ్యవధిలోనే పైనున్న కోచింగ్ సెంటర్‌కు విస్తరించడం వల్లే విద్యార్థులు లోపల చిక్కుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ప్రాథమికంగా ప్రకటించినప్పటికీ, లోపల ఎంతమంది ఉన్నారనే దానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
