Fire Accident : ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే నేడు ఉదయ్ నగర్ లోని ఓ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Fire Accident

Fire Accident In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం (జూన్ 21,2021)లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే నేడు ఉదయ్ నగర్ లోని ఓ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలానికి24 ఫైర్ ఇంజన్ లతో చేరుకుని మంటలను అదుపులోకి తేవటానికి యత్నిస్తున్నారు.

ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకూ సమాచారం లేదని అధికారులు తెలిపారు. కానీ..ఆస్తినష్టం భారీగా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

కాగా కొన్ని రోజుల క్రితం లజపత్ నగర్ మార్కెట్ లోని ఓ బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగి కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే. కాగా..ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.