Ethiopia Flight : ఇథియోపియా విమానం కాక్‌పిట్‌లో పొగ…ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం కాక్‌పిట్‌లో పొగ రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం అడిస్ అబాబాకు వెళ్లే మార్గంలో కాక్‌పిట్‌లో పొగ కనిపించడంతో టేకాఫ్ అయిన వెంటనే ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది....

Ethiopia Flight : ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం కాక్‌పిట్‌లో పొగ రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం అడిస్ అబాబాకు వెళ్లే మార్గంలో కాక్‌పిట్‌లో పొగ కనిపించడంతో టేకాఫ్ అయిన వెంటనే ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. (after smoke in cockpit) బోయింగ్ 777-8 ఈటీ 687 విమానం ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. (Flight to Ethiopias Addis Ababa returns to Delhi)

Jammu and Kashmir : అనంత్ నాగ్ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, డీఎస్పీ మృతి

విమానం టేకాఫ్ అయిన వెంటనే విమానాశ్రయానికి తిరిగి వచ్చి అత్యవసర ల్యాండింగ్ అయిందని విమానంలో ఉన్న ఒక ప్రయాణికుడు చెప్పారు. విమానం కాక్ పిట్ లో పొగ రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానంలో 240 మందికి పైగా ఉన్నారని ఢిల్లీ విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఈ విమానం ఇథియోపియాలోని అడిస్ అబాబా నగరానికి వెళ్లాల్సి ఉండగా సాంకేతిక లోపంతో తిరిగివచ్చింది. విమానం కాక్ పిట్ లో పొగ వచ్చిన ఘటనపై విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు