Raksha Bandhan Fake Sweets : రక్షాబంధన్ వేళ స్వీట్లు కొనుగోలు చేస్తున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి..
Raksha Bandhan Fake Sweets : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజియాబాద్‌లోని ఓ గోదాంలో తయారు చేస్తున్న 1000 కిలోల నాణ్యత లేని రసగుల్లాలను అధికారులు సీస్ చేశారు.
- Harish Thanniru
- Published on- August 25, 2026 / 02:44 PM IST
Raksha Bandhan Fake Sweets
Raksha Bandhan Fake Sweets : రక్షాబంధన్ వేళ స్వీట్స్ కు ఉండే డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కల్తీ కేటుగాళ్లు రెడీ అయ్యారు. రక్షా బంధన్ రోజున సోదరుడి చేతికి రాఖీకట్టి మిఠాయి తినిపించడం ఆనవాయితీ. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో స్వీట్లు విక్రయాలు జరుగుతాయి. ఇదే అవకాశంగా భావిస్తున్న కల్తీగాళ్లు నాణ్యతలేని స్వీట్లను తయారుచేసి విక్రయాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజియాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఓ గోదాంలో తయారు చేస్తున్న 1000 కిలోల నాణ్యత లేని రసగుల్లాలను అధికారులు సీస్ చేశారు.
రాఖీ పండుగను పురస్కరించుకొని గజియాబాద్ ఫుడ్‌సేఫ్టీ అధికారులు గత కొన్ని రోజులుగా స్థానిక ఆహార విక్రయ దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీహారీపుర ప్రాంతంలోని ఓ గోదాంలో పెద్దఎత్తున కల్తీ స్వీట్స్‌ను తయారు చేసి నిల్వ చేసినట్టుగా వారికి సమాచారం వచ్చింది. దీంతో గోదాం పై అధికారులు దాడులు చేశారు. అక్కడ కల్తీ పన్నీర్, చెక్కర, రసాయనాలతో తయారు చేసిన రసగుల్లాలను గుర్తించారు.
కొన్ని శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. 1000 కిలోల మిఠాయిలను స్వాధీనం చేసుకున్నట్టుగా అధికారులు తెలిపారు.గోదాం నిర్వాహకుల లైసెన్స్ రద్దుకు చర్యలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు.
