IVF Born Calf : అస్సాంలో తొలి IVF దూడ జననం.. ‘లఖిమి’ స్వదేశీ జాతి పశువు.. బయోటెక్నాలజీ రంగంలో సరికొత్త విప్లవం
IVF Born Calf: ఇన్విట్రో ఫెర్టిలైజేషన్సాం కేతికత ద్వారా రాష్ట్రానికి చెందిన స్వదేశీ 'లఖిమి' జాతికి చెందిన తొలి ఆవు దూడ జన్మించింది.
First ever ivf calf born in assam for indigenous lakhimi cow breed
- అస్సాంలో తొలి ఐవీఎఫ్ దూడ
- ‘లఖిమి’ స్వదేశీ జాతి పశువు
- బయోటెక్నాలజీ రంగంలో కీలక మైలురాయి
IVF Born Calf: అస్సాంలో పశుసంవర్ధక రంగం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (IVF Calf Born) సాంకేతికత ద్వారా రాష్ట్రానికి చెందిన స్వదేశీ ‘లఖిమి’ జాతికి చెందిన తొలి ఆవు దూడ జన్మించింది. అస్సాం వెటర్నరీ అండ్ ఫిషరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈ విజయం సాధ్యమైంది. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీని ఉపయోగించి స్వదేశీ పశువుల అభివృద్ధిలో సాధించిన ఈ విజయం రాష్ట్ర పశుసంపద సంరక్షణలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
Also Read – N Ramachandra Rao: బీజేపీ ఫీజు రీయింబర్స్మెంట్ లడాయి.. రేవంత్ ప్రభుత్వంపై రాంచందర్ షాకింగ్ కామెంట్స్
స్వదేశీ పశువుల సంరక్షణకు ఊతం:
ఈ చారిత్రాత్మక విజయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ సైంటిస్టులు, వైద్యుల బృందానికి అభినందనలు తెలిపారు. ఇది కేవలం ఒక చిన్న దూడ జననం మాత్రమే కాదని, రాష్ట్ర బయోటెక్నాలజీ, పశుసంవర్ధక రంగంలో సాధించిన అసాధారణ విజయమని ఆయన అభివర్ణించారు. సంస్కృతి, సభ్యత, సాంకేతికతలకు ఇది చక్కని ఉదాహరణ అని పేర్కొంటూ, ఈ ప్రయోగం రాబోయే రోజుల్లో సాంకేతిక విప్లవానికి దారితీస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రైతుల ఆదాయం పెంపే లక్ష్యం:
స్వదేశీ జాతుల సంరక్షణతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచడం, పాల ఉత్పత్తిని పెంచడంలో ఈ ఐవీఎఫ్ విధానం ఎంతగానో దోహదపడుతుంది. చివరికి ఇది రైతుల ఆర్థిక పురోగతికి, వారి రాబడిని పెంచడానికి కొత్త తలుపులు తెరుస్తుంది. స్వదేశీ ‘లఖిమి’ జాతి పశువుల సంఖ్యను వేగంగా పెంచడానికి, నాణ్యమైన పశుసంపదను రైతులకు అందుబాటులోకి తేవడానికి ఈ పరిశోధన మైలురాయిగా నిలవనుంది.
