పార్లమెంట్ చరిత్రలో తొలిసారి 92 మంది ఎంపీల సస్పెన్షన్
సభ నియమాలు ఉల్లంఘించడం, సభా కార్యకలాపాలకు అడ్డుపడడం, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గాను ఈ సెషన్ మొత్తం 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రెండు సభల సభాపతులు తెలిపారు
- tony bekkal
- Updated on- December 19, 2023 / 08:19 PM IST
92 MPs Suspended from Praliament: పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ ఇంత మంది సస్పెండ్ కాలేదు. ఉభయ సభల్లో కలిపి ఏకంగా 92 మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేశారు. వీరందరినీ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. పార్లమెంటు భద్రత లోపానికి సంబంధించి రాజ్యసభ, లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనను ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశం పార్లమెంటును కుదిపివేస్తోంది. కాగా, గతంలో రాజీవ్ గాంధీ హయాంలో 63 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఆ రికార్డును తిరగరాస్తూ.. మోదీ హయాంలో ఏకంగా 92 మంది ఓకేసారి సస్పెండ్ అయ్యారు.
సభ నియమాలు ఉల్లంఘించడం, సభా కార్యకలాపాలకు అడ్డుపడడం, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గాను ఈ సెషన్ మొత్తం 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రెండు సభల సభాపతులు తెలిపారు. ఈరోజు లోక్‌సభ నుంచి 33, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీల సస్పెండ్ అయ్యారు. గత గురువారం 13 మంది లోక్‌సభ నుంచి, రాజ్యసభ నుంచి ఒక ఎంపీ సస్పెండ్ అయ్యారు. కాగా, సస్పెన్షన్ నేపథ్యంలో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.
సోమవారం లోక్‌సభ నుంచి సస్పెండ్ అయినవారు
అధిర్ రంజన్ చౌదరితో పాటు కే.జై కుమార్, అపూర్వ పొద్దార్, ప్రసూన్ బెనర్జీ, మహమ్మద్ వాసిర్, జీ.సెల్వం, సీఎన్ అన్నాదురై, డాక్టర్ టీ.సుమతి, కే.నవాస్కాని, కే.వీరాస్వామి, ఎన్‌కే.ప్రేమచంద్రన్, సౌగత రాయ్, శతాబ్ది రాయ్, అసిత్ కుమార్ మల్, ఎన్టు ఆంటోనీ, ఎస్.ఎస్.పళనామ్నిక్కం, అబ్దుల్ ఖలీద్, సు.తిరునావుక్కరసర్, విజయ్ బసంత్, ప్రతిమ మండల్, కాకోలి ఘోష్, కే.మురళీధరన్, సునీల్ కుమార్ మండల్, ఎస్.రామ లింగం, కే.సురేష్, అమర్ సింగ్, రాజ్మోహన్ ఉన్నితన్, గౌరవ్ గొగోయ్, టీఆర్.బాలు సస్పెండ్ అయ్యారు.
Also Read: పార్లమెంట్ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు కీలక బాధ్యతలు
రాజ్యసభ నుంచి సస్పెండ్ అయినవారు
సమీరుల్ ఇస్లాం, కనిమొళి, ఫయాజ్ అహ్మద్, అజిత్ కుమార్, నానారాయణ్ భాయ్ జెత్వా, రంజిత్ రంజన్, రణదీప్ సూర్జేవాలా, రజనీ పాటిల్, ఎం.సంగమ్, అమీ యాగ్నిక్, ఫూలో దేవి నేతమ్, మౌసమ్ నూర్ ఉన్నారు.
