CM Revanth Reddy : పార్లమెంట్ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు కీలక బాధ్యతలు

ఇక మంత్రులకు వారి జిల్లా పరిధిలోని పార్లమెంటు స్థానాల బాధ్యతలు అప్పగించారు.

CM Revanth Reddy : పార్లమెంట్ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు కీలక బాధ్యతలు

Telangana Congress Focus On Parliament Elections

Updated On : December 18, 2023 / 9:15 PM IST

పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. పార్లమెంట్ స్థానాల వారీగా సీఎం, మంత్రులకు గెలుపు బాధ్యతలు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్ బాధ్యతలు కేటాయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆదిలాబాద్, మహబూబాబాద్ బాధ్యతలు ఇచ్చారు.

ఇక మంత్రులకు వారి జిల్లా పరిధిలోని పార్లమెంటు స్థానాల బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం పార్లమెంటు స్థానం బాధ్యతలను పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, నల్గొండ బాధ్యతలను ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. అలాగే పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భువనగిరి, జూపల్లి కృష్ణారావుకి నాగర్ కర్నూలు, శ్రీధర్ బాబుకి పెద్దపల్లి, కొండా సురేఖకు వరంగల్ బాధ్యతలు ఇచ్చారు.

Also Read : మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం.. కానీ ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నవారిని వదిలిపెట్టం : మంత్రి పొంగులేటి

రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు పార్లమెంట్ స్థానాల ఇంఛార్జులుగా బాధ్యతలు అప్పగించింది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన చేసింది కాంగ్రెస్. పీఏసీలో కూడా దీనికి సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి హైకమాండ్ కు పంపించారు.

ఒకవేళ సోనియా గాంధీ కనుక లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తే కచ్చితంగా తెలంగాణ నుంచే పోటీ చేయాలనే వినతి చేశారు. గతంలో ఇందిరా గాంధీ ఏ విధంగా అయితే మెదక్ లో పోటీ చేశారో, ఈసారి తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

Also Read : లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా పోటీ.. పీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు

మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎంకు చెరో రెండు పార్లమెంట్ స్థానాల ఇంఛార్జులుగా కేటాయించారు. మంత్రులకు ఒక్కో పార్లమెంట్ స్థానం ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ స్థానాలు చాలా ముఖ్యం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ స్థానాల్లో గెలవాలని ఒక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది.