Congress: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా పోటీ.. పీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు

అలాగే, తెలంగాణలో గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.

Congress: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా పోటీ.. పీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు

Shabbir Ali

PAC Meeting: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది పీఏసీ. అలాగే, తెలంగాణలో గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. డిసెంబర్ 28 నుంచి 15 రోజుల పాటు గ్రామ సభలు ఉంటాయి.

పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏఐసీసీ సభ్యులు సంపత్ కుమార్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీడియాకు వివరించారు. గతంలో ఇందిరా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నామని చెప్పారు. అలాగే, సోనియా గాంధీ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని అన్నారు.

తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నామన్నారు. 28న కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు నాగ్‌పూర్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో వంద రోజుల్లో 6 గ్యారెంటీ లు అమలు చేస్తామని ఆయన చెప్పారు. పీఏసీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామని, ఏకగ్రీవంగా ఆమోదం పొందాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

నామినేటెడ్ పోస్టులను పార్టీ నేతలకు త్వరలో ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని సంపత్ కుమార్ వివరించారు. పీఏసీ సమావేశంలో నామినేటెడ్ పోస్టులపై చర్చ జరిగిందని అన్నారు. లిస్టును ప్రిపేర్ చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం.. కానీ ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నవారిని వదిలిపెట్టం : మంత్రి పొంగులేటి