మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం.. కానీ ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నవారిని వదిలిపెట్టం : మంత్రి పొంగులేటి

తమది కక్ష సాధింపుల ప్రభుత్వం కాదని..ఫ్రెండ్లీ ప్రభుత్వమని..కానీ ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నవారిని విడిచిపెట్టేదిలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం.. కానీ ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నవారిని వదిలిపెట్టం : మంత్రి పొంగులేటి

Minister Ponguleti Srinivas Reddy

Minister Ponguleti Srinivas Reddy : తమది కక్ష సాధింపుల ప్రభుత్వం కాదని.. ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. కానీ ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నవారిని విడిచిపెట్టేదిలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఏ అధికారిపైనా గానీ.. ఏ నాయకులపైన గానీ తమ ప్రభుత్వానికి కక్ష లేదని అన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలకు పాల్పడివారిని ఎట్టి పరిస్థితుల్లోను విడిచిపెట్టేది లేదన్నారు.

గత ప్రభుత్వం ఒత్తిడుల వల్ల ఎవరైనా అధికారులు తప్పులు చేసి ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని.. కానీ తప్పుల్ని కొనసాగిస్తే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను అధికారులపై రుద్దారని.. ఆ ఒత్తిళ్లు భరించలేక తప్పులు చేసి ఉంటే వెంటనే సరిదిద్ధు కోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తుల్ని దోసుకున్నవారిని మాత్రం వదిలేదిలేదన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బుధవారం అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉందన్నారు. అన్ని శాఖలపై సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు..? అంటూ అప్పుడే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని.. కానీ తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే డిమాండ్ చేయటం సరికాదన్నారు. అన్నింటిమీదా సమీక్షలు నిర్వహించి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు.

Also Read: సీపీఐతో పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: నారాయణ

ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని.. డిసెంబర్ 28న మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపారు. సంక్రాంతికి మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపారు. రెవెన్యూశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని.. ధరణిలో జరిగిన తప్పుల్ని ప్రక్షాళన చేస్తామన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్దాలపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు.