CPI Narayana : సీపీఐతో పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది : నారాయణ

సీపీఐతో పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని..కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

CPI Narayana : సీపీఐతో పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది : నారాయణ

CPI Narayana

CPI Narayana..Telangana Congress : సీపీఐతో పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని..కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు.రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల వల్లే ఓడిపోయిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అందరినీ కలుపుకుపోయింది అందుకే విజయం సాధించింది అని అన్నారు.

కేరళలో 4, తమిళనాడు 2, బెంగాల్ 3, బస్తర్ లోని ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని..అలాగే తెలంగాణలో ఒక ఎంపీ, ఏపిలో ఒక ఎంపీ సీట్లో పోటీ చేస్తామని తెలిపారు. బతికి ఉండగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్‌బుక్‌లో జగన్ ఫోటోలు ఎందుకు..? అతను శాశ్వత ముఖ్యమంత్రి కాదు కదా..?అని అన్నారు.ధరణి పేరుతో కేసీఅర్ చేసిన మోసాల కంటే జగన్ ఎక్కువ తప్పులు చేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. తెలంగాణ వలెనే ఏపిలో కూడా అధికార మార్పిడి ఖాయమని అన్నారు. తెలంగాణలో పదవి విరమణ పొందిన అధికారులకు ఏ బాధ్యతలు కట్టబెట్టకూడదని ఈ సందర్భంగా నారాయణ అన్నారు.

అలాగే భూ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి సూచించారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలకు కొండంత ఆశలు ఉన్నాయని..వాటిని నెరవేర్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు అంటూ హరీష్ రావు, కేటిఆర్ చేసిన వ్యాఖ్యలు అహంభావంగా ఉన్నాయని మండిపడ్డారు.కేసీఆర్ పుణ్యమా అని ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వాలని..తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.