×
Ad

దేవ్‌జీ సహా లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు.. వివరాలు తెలిపిన డీజీపీ

మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి లొంగిపోయినట్లు శివధర్‌ రెడ్డి ప్రకటించారు.

Maoists: సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు పోలీసుల ముందు లొంగిపోయారు. దీనిపై తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి వివరాలు తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి లొంగిపోయినట్లు శశిధర్‌ రెడ్డి ప్రకటించారు.

Also Read: తండ్రిని చంపిన కొడుకు.. నివ్వెరబోయే నిజాలు.. తల మిస్సింగ్, బ్లూ డ్రమ్‌, 10 లీటర్ల కిరోసిన్..

రాజకీయ జీవితం ప్రారంభిస్తా: దేవ్‌జీ
దేవ్‌జీ మాట్లాడుతూ.. “అనారోగ్య కారణాలతో రహస్య జీవితాన్ని వదిలివేయాలని నిర్ణయించుకున్నాను, నేను నమ్మిన సిద్ధాంతాన్ని కొనసాగిస్తాను. ప్రజల సమస్యలపై ఇకపై కూడా పోరాడతాము. అనవసర చర్చలకు, అపోహలకు దారి తీసే సమయం కాదిది. మీ ప్రశ్నలు అన్నింటికి సమాధానం తర్వాత మీడియాకు, ఇంటర్వ్యూల ద్వారా తెలుపుతా. రాజకీయ జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను” అని అన్నారు.

రాజిరెడ్డి మాట్లాడుతూ.. “ప్రజల కోసం పనిచేస్తాం. చట్ట పరిధిలో పనిచేస్తాం. ప్రజలు వెనక పనిచేస్తాం. మావోయిజం ముగింపు దశలో లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉంది. మేము లొంగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వంతో చర్చించి మిగిలిన మావోయిస్టులకు ఏం సందేశం ఇవ్వాలనేది ఆలోచిస్తాం” అని తెలిపారు.