Fortune Oil: ఫార్చ్యూన్ ఆయిల్ వాడేవారికి షాక్.. నో క్వాలిటీ, నో విటమిన్స్.. తేల్చేసిన ల్యాబ్

'ఫార్చ్యూన్(Fortune Oil)' బ్రాండ్ వంటనూనెల తయారీ సంస్థ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్‌కు FSSAI జరిమానా విధించింది.

Fssai imposes penalty on fortune oil maker substandard quality

  • ఫార్చ్యూన్ ఆయిల్‌కు భారీ జరిమానా
  • తక్కువ స్థాయిలో విటమిన్ డి
  • నాణ్యతా పరీక్షల్లో బండారం బయటపడింది

Fortune Oil: ప్రముఖ ‘ఫార్చ్యూన్’ బ్రాండ్ వంటనూనెల తయారీ సంస్థ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్‌కు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) జరిమానా విధించింది. గోవాలోని తాజ్ ఫోర్ట్ అగ్వాడా రిసార్ట్ అండ్ స్పాలో నిర్వహించిన తనిఖీల్లో సేకరించిన “ఫార్చ్యూన్ ఫ్రయోలా(Fortune Oil)” శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు నూనె నమూనా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని నిర్ధారణ అయ్యింది. విటమిన్లు తగిన స్థాయిలో లేకపోవడంతో సదరు ఉత్పత్తులు నాణ్యతా లోపంతో కూడుకున్నవని పేర్కొంటూ ఆహార నియంత్రణ సంస్థ ఈ చర్యలు చేపట్టింది.

Vijay-Sangeetha Divorce: విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. పిటీషన్ వెనక్కి తీసుకున్న భార్య సంగీత

నాణ్యతా పరీక్షల్లో విటమిన్ లోపాలు వెల్లడి:

ఆహార భద్రతా ప్రమాణాల నిబంధనలు 2018 ప్రకారం ప్రాథమిక లేబొరేటరీలో జరిపిన పరీక్షల్లో ఈ ఆయిల్‌లో విటమిన్-ఎ, విటమిన్-డి స్థాయిలు నిర్ణీత పరిమితి కంటే చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. దీనిపై కంపెనీ అప్పీల్ చేయడంతో, శాంపిల్‌ను రీ-టెస్టింగ్ కోసం రెఫరల్ ల్యాబ్‌కు పంపగా, అక్కడ కూడా విటమిన్-డి పరిమాణం చాలా తక్కువగా ఉన్నట్లు ఆధారాలతో సహా ధృవీకరించబడింది. దీని ఆధారంగా గోవా అడ్జుడికేటింగ్ ఆఫీసర్ సదరు సంస్థపై జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

విధివిధానాల ఉల్లంఘనపై హెచ్చరికలు:

ఈ మధ్యకాలంలో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలు, ఈ-కామర్స్ వేదికలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాల్ పానీయాల తయారీదారుల పైనా దృష్టి సారించింది. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఏడబ్ల్యూఎల్ సంస్థకు చెందిన మంగళూరు యూనిట్ తయారు చేసిన ఈ ఉత్పత్తుల నాణ్యతా రాహిత్యంపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే విధించిన జరిమానా మొత్తం ఎంతనేది ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారికంగా వెల్లడించలేదు.