Analogue Paneer Ban : పనీర్ కొనేవారికి బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా ‘అనలాగ్ పనీర్‌’పై నిషేధం? ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపైనా నిఘా

Analogue Paneer Ban : పనీర్ తయరీదారులకు కేంద్ర ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా) కీలక హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో చర్యలకు సిద్ధమవుతోంది.

Analogue Paneer Ban

Analogue Paneer Ban : నాన్ వెజ్ ప్రియులకు ముందుగా గుర్తుకొచ్చేది చికెన్.. వెజ్ ప్రియులు ఇష్టంగా తినేది పన్నీర్. అయితే, పనీర్ ఇష్టంగా తినేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. పనీర్ అంటే పాలతో తయారయ్యే ఆరోగ్యకరమైన ఆహారం అని భావిస్తుంటారు. అయితే, ఇకపై మీరు కొనుగోలు చేసే పనీర్ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. పనీర్ పేరుతో విక్రయిస్తున్న ‘అనలాగ్ పనీర్‌’పై ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలు ఎదుర్కొంటున్న ఈ నాన్-డెయిరీ పనీర్‌పై దేశవ్యాప్తంగా నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. అసలు అనలాగ్ పనీర్ అంటే ఏమిటి? దాన్నిఎలా గుర్తించాలి? FSSAI ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది? ఇక్కడ తెలుసుకుందాం.

Also Read : Gold Silver Price Today : బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

పనీర్ తయరీదారులకు కేంద్ర ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా) కీలక హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో చర్యలకు సిద్ధమవుతోంది. పాలతో తయారు చేసిన అసలైన పనీర్ పేరుతో విక్రయిస్తున్న అనలాగ్ లేదంటే నాన్ డెయిరీ పనీర్ పై దేశవ్యాప్తంగా నిషేధం విధించే దిశగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనను రూపొందిస్తున్నట్లు వెల్లడించింది.

అనలాగ్ పనీర్ అంటే ఏమిటి?
సాధారణ పనీర్‌ను పాల నుంచి తయారు చేస్తారు. అయితే అనలాగ్ పనీర్‌లో పాల కొవ్వు లేదంటే పాల ఘన పదార్థాల స్థానంలో వెజిటబుల్ ఆయిల్, వెజిటబుల్ ఫ్యాట్ లేదా ఇతర నాన్-డెయిరీ పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి చూడటానికి, వాడటానికి అసలైన పనీర్‌లాగే కనిపిస్తాయి.
ఇలాంటి ఉత్పత్తులను అసలైన పనీర్ పేరుతో విక్రయించడం వినియోగదారులను మోసగించడమేనని ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిగణిస్తోంది. దీంతో తయారీ నుంచి విక్రయం వరకు నాన్ డెయిరీ పనీర్ ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

ఎనిమిది రాష్ట్రాల్లో నిషేదం..
అనలాగ్ లేదా నాన్-డెయిరీ పనీర్ పై ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో నిషేదం విధించారు. వీటిలో పంజాబ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఆంక్షలు మాత్రమే కాకుండా.. తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణా, పంపిణీపైనా ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నారు.

స్కూళ్ల దగ్గర ఆంక్షలు..
పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే జంక్‌ఫుడ్ పైనా ఎఫ్ఎస్ఎస్ఏఐ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో పాఠశాలలకు 50 మీటర్ల దూరంలో అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర కలిగిన ఆహార పదార్థాల విక్రయాలను నియంత్రించే ముసాయిదా నిబంధనలను రూపొందిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మరోవైపు.. ఈ-కామర్స్, క్విక్ – కామర్స్ సంస్థలు తమ యాప్ లలో విక్రయించే ఉత్పత్తలు తయారీ, గడువు (ఎక్స్‌పైరీ) తేదీలను వినియోగదార్లకు మరింత స్పష్టంగా కనిపించేలా చూడాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలిచ్చింది.