#GandhiJayanti: రాజ్‌ఘాట్ వద్ద మహాత్మగాంధీకి నివాళులు అర్పించిన రాష్ట్రపతి ముర్ము
గాంధీజీ 153వ జయంత్యుత్సవాలు, శాస్త్రీజీ 118వ జయంత్యుత్సవాలు ఆదివారం దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలతోపాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే తదితరులు నివాళులర్పించారు.
- tony bekkal
- Published on- October 2, 2022 / 06:02 PM IST
President Murmu pays tribute to Mahatma Gandhi at Rajghat
#GandhiJayanti: భారత జాతి పిత మహాత్మగాంధీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. గాంధీజీ అంత్యక్రియలు జరిగిన చోటులో ఏర్పాటు చేసిన జ్యోతికి నమస్కరించారు. కాగా, ఇదే రోజు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఉంది. ఈయనకు కూడా ఆమె నివాళులు అర్పించారు.
గాంధీజీ 153వ జయంత్యుత్సవాలు, శాస్త్రీజీ 118వ జయంత్యుత్సవాలు ఆదివారం దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలతోపాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే తదితరులు నివాళులర్పించారు.
మహాత్మా గాంధీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ) 1869 అక్టోబరు 2న జన్మించారు. ఆయన వృత్తి రీత్యా న్యాయవాది. బ్రిటిష్ పాలన నుంచి భారత దేశానికి విముక్తి కల్పించిన స్వాతంత్ర్యోద్యమానికి ఆయన నాయకత్వం వహించారు. 1948 జనవరి 30న ఆయనపై నాథూరాం గాడ్సే కాల్పులు జరిపి, హత్య చేశారు.
ఇక మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబరు 2న జన్మించారు. ఆదివారం ఆయన జయంతి సందర్భంగా ఆయనకు విజయ్ ఘాట్‌లో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పుష్పాంజలి ఘటించారు.
Gandhi Jayanti: జాతిపిత మహాత్మాగాంధీకి ప్రముఖుల ఘన నివాళి.. ఫొటో గ్యాలరీ