Gautam Adani: భారత్‌లోనే అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ.. ముకేశ్ అంబానీ రికార్డ్ బ్రేక్.. ఏకంగా రూ.9.23 లక్షల కోట్లతో..

ప్రముఖ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ(Gautam Adani) భారతంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

Gautam adani family tops hurun india rich list 2026 overtakes mukesh ambani

Gautam Adani: దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో సంచలన మార్పులు నమోదయ్యాయి. ప్రముఖ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని దాటేసి భారతంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మేరకు ఎమ్3ఎమ్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ – 2026 నివేదిక అధికారికంగా వెల్లడించింది. ప్రసిద్ధ పరిశ్రమల సమూహాల పనితీరు, షేర్ల విలువ ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో, గౌతమ్ అదానీ సంపద ఏకంగా 13 శాతం మేర వృద్ధి చెంది రూ.9.23 లక్షల కోట్లకు చేరుకోవడంతో ఆయన మొదటి స్థానానికి చేరుకున్నారు.

Train Ticket Booking: ట్రైన్ టికెట్ ఛార్జీలు పెరుగుతున్నాయా? యూపీఐ కొత్త రూల్స్‌తో ప్రయాణికుల్లో కలకలం.. అసలు నిజానిజాలు ఇవే!

ముకేశ్ అంబానీ సంపద తగ్గుదల.. మిత్తల్ కుటుంబానికి మూడో స్థానం:

మరోవైపు ఇప్పటివరకు మొదటి స్థానంలో కొనసాగిన ముకేశ్ అంబానీ కుటుంబ సంపద 10 శాతం మేర తగ్గి రూ.8.63 లక్షల కోట్లుగా నమోదైంది. దీంతో అంబానీ కంటే అదానీ(Gautam Adani) దాదాపు రూ.59,400 కోట్ల భారీ ఆధిక్యంలో నిలవడం విశేషం. ఇక ఆర్సెలర్ మిత్తల్ గ్రూప్ అధినేత ఎల్.ఎన్.మిత్తల్, ఆయన కుటుంబం 93 శాతం సంపద వృద్ధితో రూ.3.39 లక్షల కోట్లను సాధించి ఈ జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారతీయ వ్యాపార రంగంలో స్థిరమైన వృద్ధి నమోదవుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

పెరుగుతున్న మహిళా సంపన్నులు, బిలియనీర్ల సంఖ్య:

దేశంలో మహిళా వ్యాపారవేత్తల ప్రాతినిధ్యం కూడా గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే కొత్తగా 131 మంది మహిళలు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, రోష్ని నాడార్ మల్హోత్రా, ఆమె కుటుంబం రూ.2.79 లక్షల కోట్ల సంపదతో అత్యంత సంపన్న మహిళగా అగ్రస్థానంలో నిలిచారు. అలాగే భారత్‌లో డాలర్ బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయిలో 391కి చేరుకోగా, అత్యధిక సంపన్నులు నివసిస్తున్న నగరాల్లో ముంబయి మొదటి స్థానంలోనూ, బెంగళూరు, ఢిల్లీలు ఆ తర్వాతి స్థానాల్లోనూ నిలిచాయి.