Viral Video: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నడిరోడ్డుపై అమ్మాయి కిరాక్ డ్యాన్స్.. ఆ తర్వాత అసలు కథ షురూ

అదే సమయంలో బ్యాగ్ వేసుకుని రోడ్డు మధ్యలోకి వచ్చింది అమ్మాయి. బ్యాగుని రోడ్డుపై విసిరేసి, సినిమాల్లో హీరోయిన్‌లా డ్యాన్స్ చేసి.. వామ్మో..

Girl Dances

Girl Dances: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్లు పడ్డాయి. వాహనాలు ఆగిపోతున్నాయి.. అదే సమయంలో బ్యాగ్ వేసుకుని రోడ్డు మధ్యలోకి వచ్చింది ఓ అమ్మాయి. బ్యాగుని రోడ్డుపై విసిరేసి, రోడ్డుపై బోర్లా పడుకుని డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత పైకి లేచి సినిమాల్లో హీరోయిన్‌లలా మళ్లీ డ్యాన్స్ చేసింది.

వాహనదారులు అందరూ షాక్ అయ్యారు. ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే ఆమె స్నేహితులు వీడియో తీశారు. నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తే రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అవుతానని అనుకుందేమో ఆ అమ్మాయి. ఆమె వీడియోలు మరికొందరు వాహనదారులు కూడా తీసి సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆమెను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి వారితో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగడమే కాకుండా తోటి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ అమ్మాయి చిక్కుల్లో పడింది. ఈ వీడియో ఏ ప్రాంతంలో తీశారో తెలియరాలేదు.

ఇటువంటి వీడియోలు తీయొద్దని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా పదే పదే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వెరైటీగా వీడియోలు తీయాలని భావిస్తూ ఇలాంటి చెత్త వీడియోలు తీసుకుంటున్నారు చాలా మంది యువతి, యువకులు.

Sriya Reddy : పవన్ కళ్యాణ్‌పై సలార్ నటి వైరల్ కామెంట్స్..OG మూవీలో..