Train Tickets: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే జనరల్ టిక్కెట్ బుకింగ్

ఇకపై ప్రయాణికులు యాప్ ద్వారానే జనరల్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన ‘యూటీఎస్ (అన్ రిజర్వ్‌డ్ టిక్కెట్ బుకింగ్ సిస్టమ్)’ యాప్ ద్వారా జనరల్ టిక్కెట్‌తోపాటు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ కూడా బుక్ చేసుకోవచ్చు.

Train Tickets: చివరి నిమిషంలో రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు ఎక్కువగా జనరల్ బోగీల్లోనే ప్రయాణిస్తారు. ఇలాంటి వాళ్లు సంబంధిత రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలోనే టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కొన్ని సార్లు చాలా సేపు క్యూలో నిలబడాలి. టిక్కెట్ తీసుకునేలోపు ఒక్కోసారి రైలు కూడా వెళ్లిపోతుంది.

Gayathri Raghuram: అన్నామలై నాయకత్వంలో మహిళలకు రక్షణ లేదు: తమిళనాడు నేత గాయత్రి రఘురాం

పోనీ రైలు వెళ్లిపోతుందని టిక్కెట్ తీసుకోకుండా రైలెక్కితే తర్వాత భారీ జరిమానా కట్టాలి. రైళ్లో జనరల్ టిక్కెట్ తీసుకుని, ప్రయాణించే వాళ్లు చాలా సార్లు ఎదుర్కొనే సమస్యలివి. అయితే, ఈ సమస్యకు ఇకపై చెక్ పడనుంది. జనరల్ టిక్కెట్ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కొత్త సర్వీస్ తీసుకొచ్చింది. ఇకపై ప్రయాణికులు యాప్ ద్వారానే జనరల్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన ‘యూటీఎస్ (అన్ రిజర్వ్‌డ్ టిక్కెట్ బుకింగ్ సిస్టమ్)’ యాప్ ద్వారా జనరల్ టిక్కెట్‌తోపాటు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు క్యూలో నిలబడాల్సిన అవసరం తప్పుతుంది. ఫైన్ కట్టాల్సిన పరిస్థితి కూడా ఉండదు.

Jaydev Unadkat: రంజీట్రోఫీలో జయదేవ్ ఉనద్కత్ సంచలనం.. మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్

ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, జనరల్ లేదా ప్లాట్‌ఫామ్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయిన తర్వాత జీపీఎస్ ఆన్ చేసి, కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే జీపీఎస్ ద్వారానే ఇది పని చేస్తుంది. జీపీఎస్ ఆధారంగా 5-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. ప్లాట్‌ఫామ్ టిక్కెట్ బుక్ చేసుకోవాలంటే రైల్వే స్టేషన్‌కు రెండు కిలోమీటర్లు లేదా రైల్వే ట్రాక్‌కు 15 మీటర్ల దూరంలో ఉండాలి. అలాగే ఇతర నిబంధనలకు అనుగుణంగానే ఈ యాప్ ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు