Gayathri Raghuram: అన్నామలై నాయకత్వంలో మహిళలకు రక్షణ లేదు: తమిళనాడు నేత గాయత్రి రఘురాం

తమిళనాడు బీజేపీకి రాజీనామా చేయాలని బరువెక్కిన గుండెతో నిర్ణయం తీసుకున్నా. మహిళలకు గౌరవం, సమాన హక్కులు దక్కుతాయని ఆశించా. కానీ, అన్నామలై (బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు) నాయకత్వంలో మహిళలకు రక్షణ లేదు.

Gayathri Raghuram: అన్నామలై నాయకత్వంలో మహిళలకు రక్షణ లేదు: తమిళనాడు నేత గాయత్రి రఘురాం

Gayathri Raghuram: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై ఆ పార్టీ బహిష్కృత మహిళా నేత గాయత్రి రఘురాం తీవ్ర ఆరోపణలు చేశారు. అన్నామలై నాయకత్వలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. బీజేపీకి రాజీనామా చేసిన గాయత్రి మంగళవారం ట్విట్టర్ ద్వారా అన్నామలైపై విమర్శలు గుప్పించారు.

Hyderabad Metro Management : ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ సిబ్బంది ధర్నా : మెట్రో రైలు యజమాన్యం

‘‘తమిళనాడు బీజేపీకి రాజీనామా చేయాలని బరువెక్కిన గుండెతో నిర్ణయం తీసుకున్నా. మహిళలకు గౌరవం, సమాన హక్కులు దక్కుతాయని ఆశించా. కానీ, అన్నామలై (బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు) నాయకత్వంలో మహిళలకు రక్షణ లేదు. నేను బయటి వ్యక్తిగా ఉండటం మంచిది. నేను హిందూ ధర్మాన్ని బలంగా నమ్ముతాను. నేను ఆ ధర్మాన్ని రాజకీయ పార్టీలో వెతకాల్సిన అవసరం లేదు. దేవుడి కోసం, ధర్మం కోసం గుడికే వెళ్లక్కర్లేదు. దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు. నాతోనే దేవుడు ఉంటాడు. న్యాయం ఆలస్యంగా అందితే.. అది అన్యాయం కిందే లెక్క’’ అని గాయత్రి రఘురాం ట్వీట్ చేశారు. బీజేపీలో కొనసాగుతున్న గాయత్రిని అన్నామలై గత ఏడాది నవంబర్‌లో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Delhi Liquor Sale: ఆ వారం రోజుల్లో ఢిల్లీ ప్రజలు ఎన్నికోట్ల మద్యం తాగేశారో తెలుసా? బాబోయ్.. విస్కీ అయితే..

పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి ఆమెను తప్పిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ నిషేధం ఆరు నెలలపాటు కొనసాగుతుందని పేర్కొన్నాడు. అయితే, ఆరు నెలల గడువు పూర్తవకుండానే ఆమె బీజేపీకి రాజీనామా చేయడం విశేషం. ఇటీవల బీజేపీకి చెందిన ఓబీసీ మోర్చా లీడర్ తిరుచ్చి సూర్య కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. తిరుచ్చి తన పార్టీకి చెందిన ఒక మహిళా నేతతో అసభ్యంగా చాట్ చేశాడు. ఆ చాట్ లీకవ్వడంతో బీజేపీ అతడ్ని తొలగించింది. గాయత్రి రఘురాం బీజేపీలో అనేక కీలక పదవుల్లో కొనసాగారు. గాయత్రి నటి అనే సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమె హీరోయిన్‌గా నటించింది. తమిళనాడుకు చెందిన ఇరువురు నేతల రాజీనామాల నేపథ్యంలో బీజేపీలో సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది.