Delhi Liquor Sale: ఆ వారం రోజుల్లో ఢిల్లీ ప్రజలు ఎన్నికోట్ల మద్యం తాగేశారో తెలుసా? బాబోయ్.. విస్కీ అయితే..

డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 31వ తేదీ నాటికి ఢిల్లీలో మద్యం విక్రయాల వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ వారం రోజుల్లో రూ. 218 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయి. అంటే దాదాపు 1.10 కోట్ల మద్యం బాటిళ్లు అక్కడి మందుబాబులు తాగేశారన్నమాట.

Delhi Liquor Sale: ఆ వారం రోజుల్లో ఢిల్లీ ప్రజలు ఎన్నికోట్ల మద్యం తాగేశారో తెలుసా? బాబోయ్.. విస్కీ అయితే..

Delhi Liquor sale

Delhi Liquor Sale: క్రిస్మస్ నుంచి న్యూఇయర్ వరకు దేశంలో ఎక్కడైనా మద్యం విక్రయాలు భారీగా ఉంటాయి. ముఖ్యంగా నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం సేల్స్ విపరీతంగా ఉంటాయి. తాజాగా ఢిల్లీలో మద్యం విక్రయాల లెక్కలు చూస్తే.. క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వేడుకల వరకు ఢిల్లీలో మందుబాబులు మద్యంలో మునిగితేలారని చెప్పొచ్చు. దేశరాజధాని కావటంతో మిగిలిన రాష్ట్రాల కంటే ఢిల్లీలో మద్యం విక్రయాలు 200 కోట్ల మార్క్ ను దాటేశాయి.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు

డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 31వ తేదీ నాటికి ఢిల్లీలో మద్యం విక్రయాల వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ వారం రోజుల్లో రూ. 218 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయి. అంటే దాదాపు 1.10 కోట్ల మద్యం బాటిళ్లు అక్కడి మందుబాబులు తాగేశారన్నమాట. డిసెంబర్ 31 రోజు మాత్రం.. రూ. 45కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అయితే వీటిల్లో విస్కీ విక్రయాలు అధికంగా జరిగినట్లు అధికారులు తెలిపారు.

Delhi Liquor Scam : లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక మలుపు.. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో సహా ఏడుగురికి సమన్లు జారీ

2022 డిసెంబర్ నెలలో మద్య విక్రయాలతో ఎక్సైజ్ సుంకం, విలువ ఆదారిత పన్ను ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 560 కోట్ల ఆదాయం లభించింది. ఢిల్లీలో 550 మద్యం దుకాణాలు ఉన్నాయి. 900 కంటే ఎక్కువ హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లలో బార్‌లు కలిగి ఉన్నాయి. ప్రభుత్వం రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీ 2021- 2022 అమలుపై సీబీఐ విచారణతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 2022 సంవత్సరాన్ని రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలతో ముగించింది.