Delhi Liquor Scam : లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక మలుపు.. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో సహా ఏడుగురికి సమన్లు జారీ

లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సీబీఐ చార్జ్ షీటును పరిగణలోకి తీసుకుంది ట్రయల్ కోర్టు. దీంతో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో సహా ఏడుగురికి సమన్లు జారీ చేసింది.

Delhi Liquor Scam : లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక మలుపు.. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో సహా ఏడుగురికి సమన్లు జారీ

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ పలు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు..ప్రముఖులకు చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే పలు మలుపులు తిరిగిన ఈకేసు మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సీబీఐ చార్జ్ షీటును ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో సహా ఏడుగురికి సమన్లు జారీ చేసింది. నిందితుల జాబితాలో విజయ్ నాయర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్లలో ఒకరైన అభిషేక్ బోయినపల్లిలు కూడా ఉన్నారు. ఈరోజు ఈకేసును విచారించిన ట్రయల్ కోర్టు తరుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది. సీబీఐ చార్జ్ షీటులో విజయ్ నాయర్,అభిషేక్ బోయిన్‌పల్లి,అరుణ్ ఆర్. పిళ్లై,మూత గౌతమ్,సమీర్ మహేంద్రు,అప్పటి ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న కుల్‌దీప్‌ సింగ్‌,అప్పటి అసిస్టెంట్. కమీషనర్ నరేందర్ సింగ్ లు ఉండగా వారికి సమన్లు జారీ చేసింది సీబీఐ.

అభిషేక్‌ వెనుక ఉన్న ప్రముఖులపై కూడా సీబీఐ కన్నేసింది. సీబీఐ నెక్ట్స్​ టార్గెట్ వారేనని తెలుస్తోంది. అభిషేక్‌ ద్వారానే ఆ విషయాలను చెప్పించి…. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీబీఐ రంగంసిద్ధం చేస్తోంది. హవాలా ద్వారా మద్యం ముడుపుల చెల్లింపులకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తల్లో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి హైదరాబాద్‌కు లింకుందని ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ప్రాథమిక ధర్యాప్తులోనే వెల్లడైంది. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తీగలాగితే… డొంక కదిలినట్లు… లిక్కర్ కుంభకోణంకేసు ధర్యాప్తు ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలినుంచి ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతూనే ఉంది. ఈకేసు ఇంకా ఎన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాలి.

ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఉండటం..సీబీఐ కవితకు నోటీసులు జారీ చేయటం ఆమెను విచారించటం కూడా జరిగింది. కవిత ఈకేసులో ఇరుక్కోవటంతో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోపక్క ఈ కేసునుంచి బయటపడటానికి కవిత పలుమార్లు తండ్రి, సీఎం కేసీఆర్ తో పలుమార్లు సమావేశమయ్యారు.పలు అంశాలు చర్చించారు.