×
Ad

WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి షాక్.. ఇకనుంచి సిమ్ బైండింగ్ తప్పనిసరి.. లేదంటే పనిచేయదు

వాట్సాప్(WhatsApp) వాడకంలో సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.

Government makes SIM binding mandatory for WhatsApp use

WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుంచి వాట్సాప్ (WhatsApp)కు సిమ్ బైండింగ్ తప్పనిసరి చేస్తూ నిబంధనను తీసుకువచ్చింది. ఈ నిబంధన మార్చి 1 నుంచి అమలులోకి రానుంది. ఇంతకాలం యూజర్స్ తమ ఫోన్ లో సిమ్ లేకపోయినా కేవలం నంబర్ యూజ్ చేస్తూ వాట్సాప్ వాడుకునే వారు. కానీ, ఇకనుంచి ఆ అవకాశం ఉండదు. మీరు యూజ్ చేస్తున్న వాట్సాప్ నంబర్ తప్పనిసరి మొబైల్ లో ఉండాలి.

AP Liquor Scam: లిక్కర్‌ కేసులో అవినాష్ రెడ్డికి ACB కోర్టు రిమాండ్‌.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించిన SIT

ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వమ్. ఈ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ నియమానికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిబంధలను పాటించని యాప్‌ పై కఠినమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, వాట్సాప్ వెబ్ ఆప్షన్ ను వాడే వారు ప్రతీ 6 గంటలకు ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే, వెబ్ సెషన్ క్యాన్సల్ ఆటోమేటిక్ గా ముగుస్తుంది. ఈ నిబంధనలు కేవలం వాట్సా‌ప్‌కు మాత్రమే కాకుండా, టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్స్‌కు కూడా వర్తించనుంది. ఇక మార్చి 1లోగా ఆయా యాప్ లు ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్పులు చేయాలని లేదంటే చర్యలు తప్పవని ప్రకటించింది.