Bhopal : వర్షాల కోసం గాడిదలకు గులాబ్ జామ్‌లు.. మధ్యప్రదేశ్‌లో విచిత్ర ఆచారం! వీడియో వైరల్
Bhopal Donkeys Fed Gulab Jamuns : భోపాల్‌లోని కోలార్ రోడ్ ప్రాంతంలో వర్షాల కోసం స్థానికులు గాడిదలకు గులాబ్ జామ్ లను తినిపించారు.
- Harish Thanniru
- Updated on- July 19, 2026 / 10:02 AM IST
Bhopal Donkeys Fed Gulab Jamuns
- గాడిదలకు గులాబ్ జామ్‌లు
- వర్షాల కోసం మధ్యప్రదేశ్‌లో వింత ఆచారం
- గాడిదలకు తీపిపదార్థాలు తినిపించిన స్థానికులు
Bhopal Donkeys Fed Gulab Jamuns : దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కోసం ప్రజలు.. ముఖ్యంగా రైతులు ఆకాశంవైపు ఆశగా చూస్తున్నారు. వర్షాలు కురిపించు వరుణ దేవుడా అంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు వర్షాలకోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చాలా గ్రామాల్లో కప్పల కావడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.. శివుడికి నీళ్లాభిషేకం చేస్తూ వరుణ దేవుడి కరుణ కోసం ప్రార్థిస్తున్నారు. ఇదే తరహాలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వర్షాల కోసం గాడిదలకు గులాబ్ జామ్ లను తినిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భోపాల్ వాసులు ఓ వినూత్న సంప్రదాయాన్ని నిర్వహించారు. మంచి వర్షాలు పడాలని కోరుకుంటూ గాడిదలకు గులాబ్ జామ్‌లను తినిపించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భోపాల్‌లోని కోలార్ రోడ్ ప్రాంతంలో స్థానికులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక విశ్వాసాల ప్రకారం.. వర్ష దేవుడు ఇంద్రుడిని ప్రసన్నం చేయడానికి గాడిదలకు స్వీట్లు తినిపించడం శుభసూచకంగా భావిస్తారు. గాడిదలకు గులాబ్ జామ్‌లను పెట్టడంతో పాటు మంచి వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు.
అధికారిక గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్‌లో ఈ మాన్సూన్ సీజన్‌లో ఇప్పటివరకు 35 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే భోపాల్ నగరంలో మాత్రం ఇప్పటివరకు సాధారణ సగటుతో పోలిస్తే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Bhopal, Madhya Pradesh: Amid a delayed monsoon, residents performed an unusual ritual by feeding gulab jamuns to donkeys in an attempt to appease the rain gods and pray for rainfall. pic.twitter.com/HvfH1EdIaL
— IANS (@ians_india) July 18, 2026
